నల్గొండ చౌరస్తాలో తేల్చుకుందామా..: కోమటిరెడ్డి బ్రదర్స్ కు బూర నర్సయ్యగౌడ్ సవాల్

By Nagaraju penumalaFirst Published Apr 3, 2019, 9:11 PM IST
Highlights

కోమటిరెడ్డి బ్రదర్స్, బూర నర్సయ్య గౌడ్ ల మధ్య విమర్శల దాడి తారా స్థాయికి చేరుకుంటోంది. తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సవాల్ విసిరారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. 

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యమాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా భువనగిరిలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. 

కోమటిరెడ్డి బ్రదర్స్, బూర నర్సయ్య గౌడ్ ల మధ్య విమర్శల దాడి తారా స్థాయికి చేరుకుంటోంది. తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సవాల్ విసిరారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. 

ఎంపీగా ఉంటూ తన కాంట్రాక్టులను మాత్రమే సెట్ చేసుకున్నాడని ఆరోపించారు. బినామీ పేర్లతో కాంట్రాక్టులు పొందారని ఆరోపించారు. 2009లో ఆరు కోట్ల సంపాదన ఉన్న రాజగోపాల్ రెడ్డికి పదేళ్లలో 360 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఎంపీగా రాజగోపాల్ రెడ్డి భువనగిరి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. తాను ఎంపీగా భువనగిరి అభివృద్ధి కోసం రూ.5461 కోట్ల నిధులు తెచ్చానని నర్సయ్య గౌడ్ వివరించారు. 

ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం చేశారో నల్గొండ చౌరస్తాలో చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై కోమటిరెడ్డి బ్రదర్స్‌తో ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. 

డబ్బుతో నల్గొండ రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఓటమి తప్పదన్నారు. భువనగిరి ఖిల్లాపై మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామని బూర నర్సయ్యగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. 

click me!