మరో పది రోజులే... హైదరాబాద్ కార్పోరేటర్లకు కేటీఆర్ సూచన

Published : Apr 01, 2019, 06:21 PM IST
మరో పది రోజులే... హైదరాబాద్ కార్పోరేటర్లకు కేటీఆర్ సూచన

సారాంశం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పునరావృతం అయ్యేలా కృషి చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ కార్పోరేటర్లకు సూచించారు. మరీ ముఖ్యంగా తాను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ పరిధిలోని చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించేలా చూడాలని కార్పోరేటర్లకు సూచించారు. పోలింగ్ కు మరో పదిరోజులు మాత్రమే మిగిలుందని గుర్తు చేసిన కేటీఆర్ ప్రతి క్షణం ప్రజల్లోనే వుంటూ ముమ్మరంగా ప్రచారం చేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారి వారి డివిసన్ల లో సాధించే మెజార్టీ లను కార్పొరేటర్ల పనితీరుకు, ప్రజాదరణకు సూచికగా భావిస్తామని కేటీఆర్ తెలిపారు. 

రేపటిలోగా కార్నోరేటర్లంతా తమ పరిధిలోని బూత్ కమిటీలతో పాటు ఇంచార్జిలు, పార్టీ ప్రధాన కార్యకర్తలకు సంబంధించిన జాబితాను అందించాలని కోరారు. విస్తృతంగా డోర్ టు  డోర్ క్యాంపెయిన్ చేయాలని కోరారు. తమ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, అపార్ట్మెంట్ కమిటీలను కలిసి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్క కార్పొరేటర్ తాము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ సాధించేలా పనిచేయాలన్నారు.  

అసెంబ్లీ ఎన్నికల్లో నగరవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభించిందని...పార్లమెంట్ ఎన్నికల్లోనూ దీనిని స్ఫూర్తిగా తీసుకుని అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని..కేవలం వారి వద్దకు వెళ్ళి తెలంగాణ రాష్ట సమితికి ఓటు వేయాలని అడిగితే సరిపోతుందన్నారు. ఇందుకోసం ఇంటింటికి ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 16 ఎంపీ స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుందన్నారు. అయితే గ్రేటర్ పరిధిలోని చేవెల్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల్లోనే అత్యధిక మెజారిటీ వచ్చేలా కార్పొరేటర్లు కృషి చేయాలన్నారు. 

ఈ మూడు స్థానాల్లో అభ్యర్థులు యువకులు కావడం పార్టీకి ఖచ్చితంగా కలిసొస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థులు, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలని కార్పోరేటర్లకు సూచించారు. నగరంలో తాను చేపట్టనున్న రోడ్ షోల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ ప్రచారానికి సంబంధించి మేయర్ బొంతు రామ్మోహన్ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 

కార్పొరేటర్ లతో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి,  మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్  బాబా ఫసీయోద్దీన్,పార్టీ  కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్, మరియు సీనియర్  నాయకులు నవీన్ రావు, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి పండుగకి....
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్