ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

By narsimha lodeFirst Published Mar 22, 2019, 6:08 PM IST
Highlights

ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు మూకుమ్మడి నామినేషన్లు దాఖలు చేయాలని సుబాబుల్ రైతులు యోచిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పసుపు, ఎర్రజొన్న రైతులు కూడ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు మూకుమ్మడి నామినేషన్లు దాఖలు చేయాలని సుబాబుల్ రైతులు యోచిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పసుపు, ఎర్రజొన్న రైతులు కూడ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

తమ కష్లాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి  తీసుకొచ్చేందుకు గాను సుబుల్ రైతులు  మూకుమ్మడిగా నిమినేషన్లు దాఖలు చేయాలని  ప్లాన్  చేస్తున్నారు. శుక్రవారం నాడు  64 మంది రైతులు నామినేషన్ పత్రాలను తీసుకొన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు సోమవారం నాడు ఆఖరి రోజు. దీంతో సుబాబుల్ రైతులు సోమవారం నాడు నామినేషన్లను దాఖలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 10 వేల హెక్టార్లలో రైతులు సుబాబుల్ పంటను సాగు చేస్తున్నారు. ఈ జిల్లాలోని ఓ పరిశ్రమ రైతుల నుండి కొనుగోలు చేసే సుబాబుల్‌కు మెట్రిక్ టన్నుకు రూ. 3 నుండి రూ. 4 వేలకే కొనుగోలు చేస్తోంది. కనీసం మెట్రిక్ టన్నుకు రూ. 6వేలు ఉంటే సగం కూడ తమకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో మూకుమ్మడి నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు యోచిస్తున్నారు.  ఇప్పటికే పసుపు, ఎర్రజొన్న రైతులు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో  మూకుమ్మడి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు రైతులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)

 

click me!