మా పోటీ 16 లోక్ సభ స్థానాలతో కాదు...542 స్థానాలతో: హరీష్

By Arun Kumar PFirst Published Mar 27, 2019, 6:11 PM IST
Highlights

మొదటి విడత లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ప్రముఖ రాజకీయ పార్టీలన్ని గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మెదక్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థి  గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట  ఎమ్మెల్యే ప్రచాహోరును పెంచారు. ప్రతిరోజూ మెదక్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ప్రచారంలో పాల్గొంటున్న హరీష్... ప్రజలతో మమేకమవుతూ మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు.  

ఈ క్రమంలో బుధవారం నంగునూర్ మండల కేంద్రంలో జరిగిన ప్రచార సభలో హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు కారుకు ఓటేస్తే కాళేశ్వరం నీళ్లతో వారి కాళ్లు కడుగుతానన్నారు. రైతులకు అండగా నిలవడానికి టీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభిందని...వాటిలో కొన్ని అప్పుడే పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలో వున్నాయని గుర్తుచేశారు. అన్ని ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ప్రతి మారుమూల ప్రాంతానికి సాగునీరు అందుతాయని హరీష్ తెలిపారు. 

ప్రస్తుతం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మెజారిటీ విషయంలో కేవలం తెలంగాణ లోని 16 స్థానాలతో పోటీ పడట్లేదని... దేశంలోని 542 ఎంపీ స్థానాలతో పోటీ పడుతున్నారని తెలిపారు. అతన్ని అత్యధిక  మెజారిటీతో గెలిపించి దేశంలో మెదక్ పేరు మారుమోగేలా చేయాలన్నారు.. ఇలా చేయడ ద్వారా సీఎం కేసీఆర్  గౌరవాన్ని, సిద్దిపేట గౌరవాన్ని మరోసారి దేశవ్యాప్తంగా చాటిచెప్పాలన్నారు. 

కొద్దిరోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా తనను రాష్ట్రంలో రికార్డు మెజారిటీతో గెలిపించారని హరీష్ గుర్తు చేశారు. తనపై ఇంత ప్రేమ ప్రదర్శించిన నియోజకవర్గ ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనన్నారు. నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని హరీష్ అన్నారు. 

సీఎం కేసీఆర్ అభివృద్ధిని చూసే అన్ని నియోజకవర్గాల్లో లక్ష మెజార్టీ ఇస్తామని ఎమ్మెల్యేలంతా పోటీపడుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి తనకు ఎంత మెజార్టీ ఇచ్చారో ప్రభాకర్ అన్నకు కూడా అంతే మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఎంపీ , ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సరిగ్గా ఉంటేనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందుతాయని హరీష్ వెల్లడించారు. 

click me!