బ్యాలెట్ ఎన్నికలే తమను గెలిపిస్తాయి... ఈవీఎంలు కావు: ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Mar 27, 2019, 3:03 PM IST
Highlights

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందడంపై టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రెండు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరగడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్న తమ అనుమానాలకు ఈ ఫలితాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని అన్నారు.ఇలా ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు చతికిల పడిందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఉత్తమ్ అన్నారు. 

నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని నేరెడుచర్ల లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చుచేసే బలముంది కాబట్టే నరసింహారెడ్డిని నల్గొండ బరిలోకి టీఆర్ఎస్ దించిందన్నారు. ఆయన అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి సిద్దమయ్యారని ఆరోపించారు. ఆ డబ్బంతా భు కబ్జాలతో సంపాదించేదేనని ఉత్తమ్ ఆరోపించారు. అలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపించి లోక్ సభకు పంపవద్దని ప్రజలకు సూచించారు. 

తాను దేశరక్షణ కోసం దాదాపు 16ఏళ్లు పోరాడి దేశ సేవ చేశానని ఉత్తమ్ తెలిపారు. ఆ తర్వాత కూడా ప్రజాసేవ చేస్తున్నానని... తనను పిర్లమెంట్ కు పంపిస్తే ప్రజల గొంతు అక్కడ వినిపిస్తానన్నారు. తనను గెలిపించి మోదీ,, కేసీఆర్ లకు తగిన గుణపాఠం చెప్పాలనిఉత్తమ్ ప్రజలను కోరారు. 

ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గతంలో మునుగోడు ఎంపీపీగా కూడా గెలవలేకపోయాడని గుర్తుచేశారు. అలాంటిది ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీచేస్తున్నారని.. మళ్లీ ఎంపిపి ఫలితమే పునరావృతం అవుతుందన్నారు.  టీఆర్ఎస్ పార్టీ రాజకీయ అనుభవమున్న వారిని ఎంపీగా అవకాశమిస్తే తాము ఆహ్వానించేవారమని...కానీ ఇలా అవినీతి పరులకు టికెట్లవ్వడాన్ని సహించలేకే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చిందని ఉత్తమ్ తెలిపారు.      

click me!