సిద్దిపేట చూసి కేసీఆర్, కేటీఆర్ భయపడుతున్నారు...అందువల్లే...: కోమటిరెడ్డి

By Arun Kumar PFirst Published Mar 31, 2019, 11:46 AM IST
Highlights

సిద్దిపేట నియోజకవర్గాన్ని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు భయంతో వణికిపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అక్కడ గెలవలేమన్న భయంతోనే ఒకరు గజ్వేల్ మరొకరు సిరిసిల్ల కే పారిపోయారని అన్నారు. ఇలా పుట్టిపెరిగిన నియోజకవర్గ ప్రజలనే మెప్పించలేకపోయిన వారు రాష్ట్ర ప్రజలను ఎలా మెప్పిస్తారని ప్రశ్నించారు. ఇలా సిద్దిపేటలో చెల్లని రూపాయలు(కేసీఆర్, కేటీఆర్‌లు) గజ్వేల్, సిరిసిల్ల లకు వెళ్లి పాగా వేసాయని విమర్శించారు. 

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న కేసీఆర్ కు ప్రజలే బుద్దిచేబుతారన్నారు.  ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేసి బుద్దిచెప్పారని గుర్తుచేశారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా ప్రతిఒక్కరు కేసీఆర్ కు ఓటుహక్కుతోనే బుద్ది చెప్పాలని సూచించారు.

ఈ ఎమ్మెల్యేల వలసలను నియంత్రించడానికి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని సూచించారు. తమకు టిపిసిసి పగ్గాలుు అప్పగిస్తే ఈ ఐదేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేసి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. అధిష్టానం ఆ విషయంపై ఆలోచించి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటే బావుంటుందని రాజగోపాల్ రెడ్డి సూచించారు.  

click me!