లోక్ సభ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన రేవంత్...

By Arun Kumar PFirst Published Mar 13, 2019, 5:13 PM IST
Highlights

గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి ఆయన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ క్రమంలో ఇటీవలే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఆ ప్రచారం మరింత జోరందుకుంది. దీంతో తాజాగా లోక్ సభ ఎన్నికల్లో పోటీపై తాజాగా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

ఆయన బుధవారం సీఎల్పీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే మరికొద్దిరోజుల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగనున్నట్లు వెల్లడించారు. అయితే తాను ఎక్కడి నుండి పోటీ చేయనున్నది తమ అదిష్టానం నిర్ణయిస్తుందని...వారి ఆదేశాల  మేరకు ఎక్కడినుండైనా పోటీ  చేయడానికి సిద్దమని రేవంత్ స్పష్టం చేశారు. 

ప్రస్తుతం కష్టకాలంలో వున్న కాంగ్రెస్లో తాను ఓ క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా వ్యవహరిస్తానన్నారు. అధిష్టానం ఆదేశాల ప్రకారం పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. గెలుపు, ఓటములకు భయపడకుండా కార్యకర్తలకు, అనుచరులకు మరీ ముఖ్యంగా పార్టీకి అండగా వుండాల్సిన అవసరం సీనియర్ నాయకులపై వుందని రేవంత్ పేర్కొన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుని లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధింస్తుందని రేవంత్ దీమా వ్యక్తం చేశారు. ముఖమంత్రి కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్  అయితే ... కాంగ్రెస్ పార్టీ టెండూల్కర్ లాంటిదని సెటైర్లు విసిరారు. తాము ప్రగల్బాలతో కాకుండా తమ సామర్థ్యంతో మాత్రమే ముందుకెళతామని రేవంత్ పేర్కొన్నారు. 

click me!