ప్రగతి భవన్‌కు చేరుకున్న సబిత, కార్తిక్, సండ్ర...ముఖ్యమంత్రితో భేటీ

By Arun Kumar PFirst Published Mar 13, 2019, 4:26 PM IST
Highlights

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఆమె ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.ప్రస్తుత చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి తో పాటు టిడిపి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. 

ఇటీవల చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిదిలో జరిగిన కాంగ్రెస్ లోక్ సభ సన్నాహక సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో తన తనయుడు కార్తిక్ రెడ్డి సరైన ప్రాధాన్యత లభించలేదని సబిత  ఆగ్రహంతో వున్నారు. అంతేకాకుండా చేవెళ్ల టికెట్ దాదాపు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖాయమైనట్లు సమాచారం అందడంతో ఆమె పార్టీ మారడానికి  సిద్దమైనట్లు తెలుస్తోంది. 

కొడుకు కార్తిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కోసమై సబిత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తోంది. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ఆమె భవిష్యత్ నిర్ణయం తీసుకోనున్నారు. 

ఇక సత్తుపల్లి టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా గతకొంత కాలంగా టీఆర్ఎస్ లో చేరతాడని ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి తో సమావేశమయ్యారు. వీరందరు టీఆర్ఎస్ చేరికపై ఈ భేటీ తర్వాత స్పష్టత రానుంది. 

ప్రస్తుతం సికింద్రాబాద్ లోక్ సభ సన్నాహక సభలో పాల్గొన్న టీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ మరికొద్దిసేపట్లో ప్రగతి భవన్ కు చేరుకోన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. 
 
click me!