ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ: కొట్టుకొన్న జైపాల్, కసిరెడ్డి వర్గీయులు

By narsimha lodeFirst Published Apr 2, 2019, 11:12 AM IST
Highlights

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడు గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గీయుల మధ్య మంగళవారం నాడు గొడవల జరిగింది. 


కడ్తాల్:  రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడు గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గీయుల మధ్య మంగళవారం నాడు గొడవల జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  వర్గీయులు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

నాగర్‌కర్నూల్  పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి పి.రాములుకు  మద్దతుగా  ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వచ్చాడు. అయితే ప్రచార వాహనంపై ఎమ్మెల్యే కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫోటో లేకపోవడాన్ని ఆయన వర్గీయులు  గుర్తించారు.

ఎమ్మెల్యే ఫోటో లేకుండా ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారని జైపాల్ యాదవ్ వర్గీయులు ప్రశ్నించారు. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకొన్నారు.  దీంతో జైపాల్ యాదవ్  వర్గానికి చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసుల బందోబస్తు మధ్య ప్రచారం కొనసాగింది.

click me!