నా మెజారిటీ రెండు లక్షలు...రిగ్గింగ్ జరక్కుంటే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

By Arun Kumar PFirst Published Apr 10, 2019, 2:00 PM IST
Highlights

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ రిగ్గింగ్ కు పాల్పడే అవకాశాలున్నాయని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ కు పాల్పడటం వల్లే టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ వచ్చిందన్నారు.  తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థికి 30 వేల మెజారిటీ రావాల్సింది ఈ రిగ్గింగ్ కారణంగా కేవలం 3వేల మెజారిటీ మాత్రమే వచ్చిందని గుర్తుచేశారు. దీన్ని బట్టే రిగ్గింగ్ జరిగనట్లు స్పష్టంగా అర్థమయిందని కొండా అన్నారు. 

మంగళవారం గాంధీభవన్ కు విచ్చేసిన  విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ నేతలు కొదండరెడ్డి, అద్దంకి దయాకర్ లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ...ఈ లోక్ సభ ఎన్నికల్లో తాను 2 లక్షల మెజారిటీతో గెలవనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. అయితే చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూతుల్లో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడే అవకాశముందని తమకు అనుమానంగా వుందన్నారు. ఇలా రిగ్గింగ్ కు పాల్పడినా తన గెలుపును అడ్డుకోలేరని...కేవలం మెజారిటీని మాత్రమే తగ్గించగలరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు 30వేల పైచిలుకు మెజారిటీతో గెలవాల్సిందని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కానీ పోలింగ్ సమయంలో భారీగా రిగ్గింగ్ జరగడంతో ఆ మెజారటీ 3 వేలకు తగ్గిందన్నారు. అదేమాదిరిగా ఇప్పుడు కూడా రిగ్గింగ్ జరిగినా గెలుపు తనదేనని టీఆర్ఎస్ , బిజెపిలో రెండో స్థానం కోసం పోటీ పడాల్సిందేనని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.  

click me!