తెలంగాణ ప్రజలకు ఏజంట్‌ను: కేసీఆర్

By narsimha lodeFirst Published Apr 3, 2019, 5:57 PM IST
Highlights

తమ పార్టీ  ప్రజలకు ఏజంటుగా పనిచేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు తమ పార్టీ దూరంగా ఉందన్నారు. ఈ రెండు పార్టీల ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

మెదక్: తమ పార్టీ  ప్రజలకు ఏజంటుగా పనిచేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు తమ పార్టీ దూరంగా ఉందన్నారు. ఈ రెండు పార్టీల ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

బుధవారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆంథోల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు.కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. తమ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏజంటుగా ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు తాము దూరంగా ఉన్నామని ఆయన చెప్పారు. 

బీజేపీ నేతలు టీఆర్ఎస్‌ కాంగ్రెస్‌తో జతకట్టిందని, కాంగ్రెస్ నేతలు బీజేపీతో తాము జతకట్టినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ వివరించారు.ఈ ప్రచారాలను నమ్మకూడదని కేసీఆర్ ప్రజలను కోరారు.

తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్టుగా ఆయన చెప్పారు. నిమ్జ్ పూర్తైతే సుమారు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని బాబు ప్రకటించారు.తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఈ రకమైన సంక్షేమ పథకాలు అమలయ్యేవి కావని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రానున్న రెండేళ్లలో ఏడున్నర లక్ష ఎకరాలకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రైతులకు సాగు నీరు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

click me!