తెలంగాణ లోక్‌సభ ఫలితాలు: కేసీఆర్‌కు షాక్

By narsimha lodeFirst Published 23, May 2019, 10:42 AM IST
Highlights

తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీకి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్ధానాల్లో తొలి రౌండ్లలో 11 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో , మరో నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకొంటే టీఆర్ఎస్ దెబ్బతిన్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
 


హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీకి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్ధానాల్లో తొలి రౌండ్లలో 11 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో , మరో నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకొంటే టీఆర్ఎస్ దెబ్బతిన్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

తెలంగాణలో కనీసం 16 ఎంపీ స్తానాలను కైవసం చేసుకొంటామని టీఆర్ఎస్ ధీమాతో ఉంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడ దాదాపుగా ఇదే రకంగా నివేదికలు  ఇచ్చాయి.తొలి దశ రౌండ్లలో టీఆర్ఎస్‌ 11  ఎంపీ స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. మహబూబాబాద్, వరంగల్ . పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, ఖమ్మం, చేవేళ్ల, భువనగిరి, మల్కాజిగిరి,నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ స్థానాల్లో  టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.

సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో  బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. నల్గగొండలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.  

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఏక పక్షంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే టీఆర్ఎస్‌కు ఈ ఫలితాలు మాత్రం వ్యతిరేకమైన తీర్పును ఇచ్చినట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ కు బలమైన కరీంనగర్, నిజామాబాద్ లాంటి స్థానాల్లో  బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగారు. 


 

Last Updated 23, May 2019, 10:42 AM IST