సునితా లక్ష్మారెడ్డి బిజెపిలో చేరిక లేనట్లేనా..? మెదక్ ఎంపి అభ్యర్థి ఆయనే

By Arun Kumar PFirst Published Mar 24, 2019, 6:49 PM IST
Highlights

కాంగ్రెస్ మాజీ మంత్రి, నర్సాపూర్ మాజీ శాసన సభ్యులు సునితా లక్ష్మారెడ్డి బిజెపిలో చేరనున్నట్లు వస్తున్న వార్తలకు తెరపడింది. ఆమెను బిజెపిలోకి చేర్చుకుని మెదక్ లోక్ సభ పోటీకి బరిలోకి దించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే తెలంగాణలోని అన్ని లోక్ సభ నియోజకవర్గాకు అభ్యర్థులను ప్రకటించిన బిజెపి పార్టీ ఒక్క మెదక్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది. దీంతో సునీతా లక్ష్మారెడ్డి బిజెపిలో చేరడం ఖాయమన్న వార్తలు మరీ ఎక్కువగా ప్రచారమయ్యాయి. 

అయితే ఆ ఊహాగానాలకు వ్యతిరేకంగా మెదక్ బిజెపి అభ్యర్థిని ప్రకటించింది. ఆ స్థానం నుండి స్థానిక నాయకులు రఘునందన్ రావు బరిలోకి దిగనున్నట్లు ప్రకటంచింది. అందుకు సంభంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన దుబ్బాక నుండి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి కేవలం సోమవారం ఒక్కరోజే సమయం మిగిలివుండటం...సునితా లక్ష్మారెడ్డి నుండి స్పందన లేకపోవడంతో రఘునందన్ పేరుకు ఖరారు చేశారు.

గత కొద్దిరోజులుగా బిజెపి తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. ఇతర పార్టీల్లో సీట్లు ఆశించి భంగపడ్డ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుని బరిలోకి దించేందుకు సీనియర్ నేత రామ్ మాధవ్ ప్రయత్నించారు. ఇలా గద్వాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె. అరుణ ను పార్టీలో చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు కానీ సునితా లక్ష్మారెడ్డి విషయంలో సక్సెస్ కాలేకపోయారు.  

కొద్దిసేపటి క్రితమే మరో తొమ్మిది మందితో కూడిన అభ్యర్ధుల లిస్ట్ ను బిజెపి ప్రకటించింది. అందులో తెలంగాణలో మిగిలిన మెదక్ తో పాటు చత్తీస్ ఘడ్, మహారాష్ట్రలోని మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 
 
click me!