మీ ఫోన్ పే, గూగుల్ పేలో లిమిట్ ఎక్సీడ్ అని చూపిస్తుందా... అయితే కారణం ఏంటో తెలుసుకోండి..

By Ashok Kumar  |  First Published Jul 8, 2024, 7:11 PM IST

UPI పేమెంట్ ద్వారా రోజుకి ఎంత పేమెంట్ చేయవచ్చో  తెలుసుకోవడం ముఖ్యం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI ద్వారా ట్రాన్సక్షన్స్  లిమిట్  నిర్ణయించింది. NPCI ప్రకారం, ఒక UPI యూజర్ ఒక రోజులో ఏ వ్యక్తికైనా రూ. 1 లక్ష వరకు పంపొచ్చు.
 


మీరు ప్రతిరోజు UPI ద్వారా మని ట్రాన్సక్షన్స్ చేయవచ్చు. అయితే దీనికి సంబంధించి డైలీ లిమిట్ గురించి మీకు తెలుసా... 

భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ ట్రెండ్ గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చిన్న షాప్ నుండి మల్టిప్లెక్స్ వరకు  ప్రతి బిల్లు పేమెంట్ చేయడానికి UPIని ఉపయోగిస్తున్నారు.

Latest Videos

undefined

UPI పేమెంట్ ద్వారా రోజుకి ఎంత పేమెంట్ చేయవచ్చో  తెలుసుకోవడం ముఖ్యం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI ద్వారా ట్రాన్సక్షన్స్  లిమిట్  నిర్ణయించింది. NPCI ప్రకారం, ఒక UPI యూజర్ ఒక రోజులో ఏ వ్యక్తికైనా రూ. 1 లక్ష వరకు పంపొచ్చు.

అదేవిధంగా క్యాపిటల్ మార్కెట్, ఇన్సూరెన్స్, బిజినెస్  ట్రాన్సక్షన్స్ పై యూపీఐ లిమిట్ రూ.2 లక్షలు. RBI రిటైల్ డైరెక్ట్ స్కిం  కింద IPO బుకింగ్ లేదా పేమెంట్ కోసం UPI ట్రాన్సక్షన్స్ లిమిట్ రూ.5 లక్షలు.

అంతే కాకుండా, గత ఏడాది డిసెంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆసుపత్రులు, విద్యా సంస్థలకు UPI పేమెంట్  ట్రాన్సక్షన్స్  పరిమితిని 5 లక్షలకు పెంచింది. ఆసుపత్రులు, విద్యా సేవల కోసం ప్రతి ట్రాన్సక్షన్స్ కి UPI పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచినట్లు NBCI సర్క్యులర్‌లో తెలిపింది.

ఈ పరిమితి వెరిఫైడ్  వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి UPI ట్రాన్సక్షన్స్ లిమిట్ లక్ష రూపాయలు, కానీ చాలా బ్యాంకులు దీనిని అనుమతించవు. ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఎన్‌బిసిఐ నిర్ణయించిన గరిష్ట పరిమితి ప్రతి లావాదేవీకి రూ. 1 లక్ష.

అటువంటప్పుడు థర్డ్ పార్టీ యాప్ ద్వారా 24 గంటల్లో 10 ట్రాన్సక్షన్స్ మాత్రమే చేయవచ్చు. దీని కంటే ఎక్కువ ట్రాన్సక్షన్స్ కోసం  మీరు ఫస్ట్  ట్రాన్సక్షన్స్ చేసినప్పటి నుండి 24 గంటలు వేచి ఉండాలి.

click me!