అర్జెంటుగా డబ్బు కావాలా? మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే లోన్ ఈజీ.. ఈ విషయాలు తెలుసుకోండి

By Ashok Kumar  |  First Published Jul 8, 2024, 6:42 PM IST

అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఓ అప్షన్ ఉపయోగించవచ్చు. తక్కువ వడ్డీ రేటుతో త్వరగా  డబ్బులు పొందే ఆ ఆప్షన్ ఏమిటంటే... 


మీరు క్రెడిట్ తీసుకున్నారా.. ? అయితే క్రెడిట్ కార్డు   ఎక్కువగా బిల్లులు చెల్లించడానికి, షాపింగ్ లేదా వస్తువులను కొనడానికి ఉపయోగిస్తారు. అయితే క్రెడిట్ కార్డుతో లోన్ తీసుకోవచ్చని ఎంత మందికి తెలుసు ? చాలా బ్యాంకులు అత్యవసర అవసరాలకు క్రెడిట్ కార్డ్ నుండి లోన్ పొందే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఎక్కువ  పేపర్ వర్క్  లేకుండా ఇంకా ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ లోన్  పొందవచ్చు. పర్సనల్ లోన్ లాగానే క్రెడిట్ కార్డ్ లోన్ కూడా తీసుకోవచ్చు. 

అనుకోకుండా లేదా ఎమర్జెన్సీగా డబ్బు అవసరాలు తలెత్తినప్పుడు ఈ అప్షన్ ఉపయోగించవచ్చు. క్రెడిట్ కార్డ్ లోన్ సాధారణంగా తక్కువ వడ్డీ రేటు ఇంకా  త్వరగా  డబ్బు అందేలా చేస్తుంది. ఈ లోన్‌లు తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో ఉంటాయి, దీని ద్వారా  మొత్తం ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా, ఈ లోన్లు 24 నెలల వరకు తిరిగి చెల్లించే టైం అందిస్తాయి, అంటే లోన్  తిరిగి చెల్లించడానికి తగినంత టైం  లభిస్తుంది.

Latest Videos

undefined

క్రెడిట్ కార్డ్ లోన్ పొందడానికి డాక్యుమెంటేషన్ చాలా ఈజీ కానీ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు, ఈ డాకుమెంట్స్  సాధారణంగా అవసరం:

* అడ్రస్  ప్రూఫ్
* ఐడెంటిటీ  ప్రూఫ్
* లేటెస్ట్  పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
* గత మూడు నెలల జీతం స్లిప్‌లు (జీతం పొందే ఉద్యోగుల కోసం)
* ఆఫీస్  ID కార్డ్ జిరాక్స్ (జీతం పొందే ఉద్యోగుల కోసం)
* తాజా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)   కాపీ (సెల్ఫ్  ఎంప్లాయిస్ దరఖాస్తుదారుల కోసం)
* పాన్ కార్డ్ కాపీ (సెల్ఫ్  ఎంప్లాయిస్  దరఖాస్తుదారుల కోసం)

click me!