ఆపిల్ ఐఫోన్ పై క్రేజీ అఫర్.. ఒక్కసారిగా తగ్గిన ధర.. ఛాన్స్ మిస్సవ్వకండి..

Published : Jul 08, 2024, 06:44 PM IST
ఆపిల్ ఐఫోన్ పై క్రేజీ అఫర్..  ఒక్కసారిగా తగ్గిన  ధర.. ఛాన్స్ మిస్సవ్వకండి..

సారాంశం

ఇండియాలో Apple iPhone 15 Pro అసలు ధర రూ.1,34,900.  అయితే ఐఫోన్ 15 ప్రో పై ప్రస్తుతం ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమాలో ఆఫర్‌ లభిస్తుంది.

 దేశంలోని వివిధ సేల్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఐఫోన్ 15 ప్రోపై డిస్కౌంట్  లభిస్తుంది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్‌లో అని  ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. 

ఇండియాలో Apple iPhone 15 Pro అసలు ధర రూ.1,34,900.  అయితే ఐఫోన్ 15 ప్రో పై ప్రస్తుతం ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమాలో ఆఫర్‌ లభిస్తుంది. వీటిలో ఫ్లిప్‌కార్ట్ అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్‌ అందిస్తోండగా, ఫ్లిప్‌కార్ట్ ఏకంగా ఫోన్‌పై రూ.14,910 డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో రూ.1,34,900 విలువైన ఫోన్ ను రూ.1,19,990కి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనవచ్చు. ఈ అఫర్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లా కాకుండా డిస్కౌంట్ తో వస్తుంది. క్రోమా, విజయ్ సేల్స్‌లో  రూ.6,910 డిస్కౌంట్ ఆఫర్ తర్వాత ఫోన్ ధర రూ.1,27,990కి లభిస్తుంది. ప్రస్తుతం ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఐఫోన్ 15 ప్రోపై ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రో అమెజాన్‌లో రూ.6,700, రిలయన్స్ డిజిటల్‌లో రూ. 5,000 డిస్కౌంట్ లభిస్తోంది.

ఐఫోన్ 15 ప్రో 6.1-అంగుళాల డిస్‌ప్లేతో, LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. ఐఫోన్ 15 ప్రోలో 48-మెగాపిక్సెల్ వైడ్, 12-మెగాపిక్సెల్ 3x టెలిఫోటో, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, వెనుకవైపు 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రో టైప్-సి USB పోర్ట్, గ్లాస్ అండ్  టైటానియం ఎక్స్టీరియర్, IP68 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, 5G, డ్యూయల్ సిమ్, Wi-Fi 6-E, బ్లూటూత్ 5.3 కూడా ఉంది. ఈ ఫోన్ వివిధ కలర్స్ లో  మార్కెట్లో లభ్యమవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే