షియోమీ రెడ్‌మీ.. ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. లేదంటే ...?

By Sandra Ashok KumarFirst Published Nov 22, 2019, 12:02 PM IST
Highlights

ఆఫీసులో టేబుల్ పై పెట్టిన రెడ్ మీ నోట్ 7 ఎస్ ఫోన చార్జింగ్ లేకుండానే పేలిపోయింది. ఇది కస్టమర్ పొరపాటు వల్లే జరిగి ఉంటుందని షియోమీ పేర్కొంది. షియోమీ మాత్రం ఎలాంటి సాంకేతిక లోపం లేదని, కస్టమర్‌ తప్పిదం వల్లే ఇలా జరిగి ఉంటుందని పేర్కొనడం చర్చకు దారి తీసింది. 

ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఒకటైన షియోమీకి మరోసారి పేలుడు షాక్‌ తగిలింది. షియోమీ పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌  ‘రెడ్‌మీ నోట్‌ 7ఎస్‌’ ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకుంది. చార్జింగ్‌లో లేకుండానే ఈ ప్రమాదం జరగడం కలకలం రేపింది. షియోమీ మాత్రం ఎలాంటి సాంకేతిక లోపం లేదని, కస్టమర్‌ తప్పిదం వల్లే ఇలా జరిగి ఉంటుందని పేర్కొనడం చర్చకు దారి తీసింది. 

ముంబై నగర వాసి ఈశ్వర్ చావన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్నిసోషల్‌ మీడియాలో పంచుకున్నారు. రెడ్‌మీ నోట్ 7ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా  కొనుగోలు చేసినట్లు చావన్ ట్వీట్‌లో వివరించారు.

also read మొబైల్.. చార్జీల పెంపు ప్రకటన...వినియోగదారులలో ఆందోళన...

‘కొత్త ఫోన్‌ ఆఫీసు టేబుల్‌ మీద పెట్టాను. సడన్‌గా ఏదో కాలుతున్న వాసన గమనించాను. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్‌లో లేదు’ అని తెలిపారు. అంతేకాదు. తన ఫోన్ ఎపుడూ కింద కూడా పడలేదని గుర్తు చేసు​కున్నారు. వెంటనే ఆయన థానేలోని షియోమీ అధీకృత దుకాణాన్ని సంప్రదించారు.

ఐదు రోజుల తరువాత, బ్యాటరీలో కొంత సమస్య ఉందని కంపెనీ చెప్పిందని చావన్ పేర్కొన్నారు. బ్యాటరీ లోపం, తయారీ లోపం వల్లే ఇలా జరిగి వుంటుందని ఆయన ఆరోపిస్తున్నారు. 

also read పేటి‌ఎం వినియోగదారులు జాగ్రత...లేదంటే మీ డబ్బులు మాయం

షియోమీ స్పందిస్తూ.. తాము నాణ్యతకు, భద్రతకు అధిక ప్రాధాన్యత యిస్తామని, గత అయిదేళ్లుగా అభిమానులుతమ బ్రాండ్‌పై చూసిన అభిమానానికి ఇది నిదర్శనమని షియోమీ తెలిపింది. తాజా ఘటనను పరిశీలించిన తరువాత, బాహ్య  పరిస్తితుల కారణంగానే నష్టం జరిగిందని తేల్చి పారేసింది. 'కస్టమర్ ప్రేరిత నష్టం' గా భావిస్తున్నట్టుగా  పేర్కొంది.  

click me!