పేటి‌ఎం వినియోగదారులు జాగ్రత...లేదంటే మీ డబ్బులు మాయం

By Sandra Ashok Kumar  |  First Published Nov 21, 2019, 5:52 PM IST

మీ పేటీఎం ఖాతాకు సంబంధించిన కేవైసీ వివరాలకోసం ఏదైనా మెసేజ్‌, ఈ మెయిల్ పట్ల జాగ్రత్తగా ఉండమని పేటి‌ఎం సి‌ఈ‌ఓ  హెచ్చరించారు. అధిక సంఖ్యలో పేటి‌ఎం వినియోగదారులు ఇప్పటికే కంపెనీ సైబర్ సెల్ మరియు ఆర్‌బి‌ఐ యొక్క అంబుడ్స్‌మన్‌ను సంప్రదించారు.


ముంబయి: ప్రముఖ ఇ-వాలెట్‌ సంస్థ పేటి‌ఎం కంపెనీ తమ కస్టమర్లను హెచ్చరించింది. పేటి‌ఎం అధికారులుగా నటిస్తున్న మోసగాళ్ల నుంచి వచ్చిన స్కామ్ సందేశాలు, ఇ-మెయిల్ నుండి పేటి‌ఎం వినియోగదారులు జాగ్రత్తగా ఉండలని, జాగ్రత్తలు పాటించాలని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సోషల్ మీడియాలో హెచ్చరించారు.

also read  స్నాప్‌చాట్ కొత్త ఫీచర్ : చూస్తే వావ్ అనాల్సిందే!

Latest Videos

" మీ పేటి‌ఎం ఖాతాను బ్లాక్ చేయడం లేదా KYC చేయమని ఏదైనా మెసేజ్ వచ్చిన, ఈ మెయిల్  వచ్చిన నమ్మవద్దు” అని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మంగళవారం సాయంత్రం ట్విటర్ లో ట్వీట్ చేశారు. తరువాత ఒక ప్రత్యేక ట్వీట్‌లో అనేక పేటీఎం కస్టమర్లకు మోసగాళ్ళు పంపిన ఎస్‌ఎంఎస్ చిత్రాన్ని పోస్ట్ చేశారు."

 "మేము మీ పేటీఎం అక్కౌంట్ ని  కొంత సమయం వరకు ఆపేస్తున్నాము వెంటనే మీ పేటీఎం కెవైసిని ఫోన్ నంబర్‌తో పాటు పూర్తి చేయండి అని సందేశాన్ని పంపిస్తారు లేదా కొన్ని లక్కీ డ్రాతో  SMS ద్వారా మీ వివరాలను పొందడానికి మోసగాళ్ళు ప్రయత్నిస్తున్నరు వారి వలలో పడకండి" అని శర్మ పేటి‌ఎం కస్టమర్లను హెచ్చరించాడు.

గత మూడు నెలల్లో వందలాది పేటిఎమ్ కస్టమర్లుకు పేటిఎమ్ ఉద్యోగులని చెప్పి స్కామ్‌ చేస్తున్నారు. కస్టమర్లు మోసపోయిన తరువాత జరిగిన మోసం పై కంపెనీ సైబర్ సెల్ మరియు ఆర్‌బిఐ అంబుడ్స్‌మన్‌లతో ఫిర్యాదులు నమోదు చేసిన తరువాత ఈ ట్వీట్లు వచ్చాయి.

also read అఫోర్డబుల్ ఫ్లాగ్ షిప్ ఫోన్ రియల్‌మీ ‘ఎక్స్‌2 ప్రో’

పేటీఎం వినియోగదారులను నుండి  ఎలాంటి వివరాలను కోరడం లేదని స్పష్టం చేశారు. ఏదైనా సందేశాలు, కాల్స్‌ వచ్చిన నమ్మవద్దని కోరారు. అలాగే  లక్కీ చాన్స్‌ అంటూ వచ్చే మెసేజ్‌ల మాయలో పడొద్దని కూడా ఆయన సూచించారు. మీ వివరాలను హ్యాక్‌ చేయడానికి మెసగాళ్లు వేసే వలలో పడకండి  అంటూ ఆయన హెచ్చరించారు. మరోవైపు చాలామంది వినియోగదారులు తమకూ ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయని ట్విటర్‌లో షేర్‌ చేయడం గమనార్హం.

click me!