120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌తో షియోమీ పాడ్ 5 లాంచ్.. ధర ఎంతంటే ?

By asianet news telugu  |  First Published Apr 27, 2022, 7:58 PM IST

షియోమీ పాడ్ 5ని 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఇచ్చారు. అంతేకాకుండా, స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్ ఇందులో లభిస్తుంది. షియోమీ పాడ్ 5లో గరిష్టంగా 256జి‌బి స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.


షియోమీ( Xiaomi)ఇండియా కొత్త టాబ్లెట్  షియోమీ పాడ్ 5 (Xiaomi Pad 5)ను ఇండియాలో లాంచ్ చేసింది.  షియోమీ పాడ్ 5 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఉంది.  అంతేకాకుండా స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్ ఇందులో ఇచ్చారు. షియోమీ పాడ్ 5లో గరిష్టంగా 256జి‌బి స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. షియోమీ పాడ్ 5 గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యింది.

 షియోమీ పాడ్ 5 ధర
 షియోమీ పాడ్ 5 ధర రూ. 26,999. 6జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ ఇంకా 6జి‌బి ర్యామ్ 256జి‌బి స్టోరేజ్ ధర రూ. 28,999. కాస్మిక్ గ్రే, పెరల్ వైట్ కలర్స్‌లో ఈ టాబ్లెట్ అందుబాటులో ఉంటుంది. మే 7 వరకు 128జి‌బి స్టోరేజ్ ట్యాబ్‌ను  రూ.24,999కి,   256జి‌బి స్టోరేజ్ రూ.26,999కి కొనుగోలు చేయవచ్చు. మొదటి సేల్ మే 3న ఉంటుంది.

Latest Videos

 షియోమీ పాడ్ 5 స్పెసిఫికేషన్లు
 షియోమీ పాడ్ 5 Android 11 ఆధారిత MIUI 12.5ని ఉంది. 1600x2560 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 11-అంగుళాల WQHD+ రెండు-టోన్ డిస్‌ప్లే లభిస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz. దీనితో డాల్బీ విజన్ అండ్ హెచ్‌డిఆర్ 10కి కూడా సపోర్ట్ ఉంది. ఈ ట్యాబ్‌లో స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్ ఇచ్చారు. 6 జి‌బి వరకు ర్యామ్ తో 256జి‌బి వరకు స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది.

కెమెరా గురించి మాట్లాడితే, Xiaomi ప్యాడ్ 5 ఫ్లాష్ లైట్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ట్యాబ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 8720mAh బ్యాటరీ ఉంది. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం, Wi-Fi, బ్లూటూత్ v5, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

click me!