నోకియా జీ సిరీస్ (Nokia G Series) కు మరో స్మార్ట్‌ఫోన్ యాడ్ అయింది. బడ్జెట్ రేంజ్‌లో నోకియా జీ21 (Nokia G21) మొబైల్ భారత్‌లో లాంచ్ అయింది. హెచ్‌ఎండీ గ్లోబల్ (HMD Global) ఈ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఫోన్‌ను ఒక్కసారి చార్జ్ చేసి మూడు రోజులు వినియోగించుకోవచ్చంటూ బ్యాటరీని హైలైట్ చేస్తోంది.
నోకియా ఫోన్‌ల తయారీదారు HMD గ్లోబల్ తాజాగా 'Nokia G21' పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు 3 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Nokia G21 స్మార్ట్‌ఫోన్ ర్యామ్ ఆధారంగా 4GB లేదా 6GB రెండు వేరియంట్‌లలో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మరి ఈ సరికొత్త Nokia G21లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Nokia G21 ధర, సేల్ వివరాలు
నోకియా జీ 21 మొబైల్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ రూ.14,999 ధరకు లాంచ్ అయింది. డస్క్, నార్డిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. నోకియా అధికారిక వెబ్‌సైట్ (nokia.com), ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ మొబైల్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
Nokia G21 స్పెసిఫికేషన్లు
Nokia G21 Specifications | 6.5 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో నోకియా జీ21 వస్తోంది. 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉంటాయి. Unisoc T606 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11తో విడుదల కాగా.. రెండు ఓఎస్ అప్‌గ్రేడ్లను ఈ మొబైల్ పొందుతుందని ఆ సంస్థ వెల్లడించింది. మైక్రో ఎస్‌డీ మెమరీ కార్డు కోసం ఈ ఫోన్‌లో స్లాట్ ఉంటుంది.వెనుక మూడు కెమెరాల సెటప్‌తో Nokia G21 మొబైల్ వస్తోంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను నోకియా అందిస్తోంది. 4G LTE, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి.
Nokia G21 మొబైల్‌లో 5050mAh బ్యాటరీ ఉంటుంది. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తోంది. అయితే ఫోన్‌తో పాటు బాక్స్‌లో 10వాట్ల చార్జర్ మాత్రమే వస్తుంది. కాల్ క్వాలిటీ మెరుగ్గా ఉండేందుకు OZO స్పెషియల్ ఆడియో క్యాప్చర్‌కు సపోర్ట్‌తో కూడిన రెండు మైక్రోఫోన్లు ఈ మొబైల్‌కు ఉంటాయి. లాక్ బటన్‌కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ బరువు మొత్తంగా 190 గ్రాములు. Nokia G21తో పాటు, కంపెనీ రెండు కొత్తగా Nokia 105, Nokia 105 Plus అనే ఫీచర్ ఫోన్‌లను అలాగే Nokia Comfort Earbudsలను విడుదల చేసింది.