ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్.. దీని స్పెషాలిటీ ఎంతో తెలిస్తే వావ్ అంటారు.. బడ్జెట్ ధరకే వచ్చేస్తోంది..

By asianet news telugu  |  First Published Apr 27, 2022, 6:02 PM IST

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ఫోన్ ధర రూ. 7,499, దీనిని మే 6 నుండి ఫ్లిప్ కర్ట్ నుండి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను ఇండియాలో  హార్ట్ ఆఫ్ ఓషన్, లైట్ సీ గ్రీన్, పోలార్ బ్లాక్, స్టార్రి పర్పుల్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు.


హాంగ్ కాంగ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ  ఇన్ఫినిక్స్ (Infinix) ఇండియాలో  ఒక కొత్త స్మార్ట్‌ఫోన్  ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 (Infinix Smart 6)ని విడుదల చేసింది.  ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 సేల్ మే 6 నుండి ప్రారంభం కానుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6  ప్రత్యేకత ఏమిటంటే బ్యాక్ ప్యానెల్ యాంటీ బాక్టీరియల్ అంటే బ్యాక్టీరియా వల్ల ప్రభావితం కాదు. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్‌లో 6.6-అంగుళాల వాటర్‌డ్రాప్ సన్‌లైట్ డిస్‌ప్లే ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 MediaTek Helio A22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, అంటే క్వాడ్-కోర్ ప్రాసెసర్.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ధర
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6  ధర రూ. 7,499గా ఉంది. దీనిని మే 6 నుండి Flipkart నుండి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను ఇండియాలో హార్ట్ ఆఫ్ ఓషన్, లైట్ సీ గ్రీన్, పోలార్ బ్లాక్, స్టార్రి పర్పుల్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Latest Videos

undefined

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 స్పెసిఫికేషన్లు
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6కి 6.6-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత XOS 7.6, MediaTek Helio A22 ప్రాసెసర్, 4జి‌బి ర్యామ్, 32జి‌బి స్టోరేజ్ ఫోన్‌తో వస్తుంది. 4జి‌బి ర్యామ్ లో 2జి‌బి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా  ఉంటుంది. ఈ బ్యాక్ ప్యానెల్‌పై బ్యాక్టీరియా ప్రభావం ఉండదని పేర్కొన్నారు.

Infinix Smart 6 డ్యూయల్ AI బ్యాక్ కెమెరా సెటప్‌తో ఉంటుంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 8 మెగాపిక్సెల్‌లు.  ఇంకా డబుల్ LED ఫ్లాష్‌తో కూడి ఉంటుంది. కెమెరా ఆటో-సీన్ డిటెక్షన్ కాకుండా AI HDR, బ్యూటీ అండ్ పోర్ట్రెయిట్ మోడ్‌లతో వస్తుంది. ఇందులో 5 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరా ఉంది.

ఫ్రంట్ కెమెరాతో పాటు ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు. Infinix Smart 6 DTS-HD సరౌండ్ సౌండ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో బ్లూటూత్ v5.0 ఉంది. ఫోన్‌తో 5000mAh బ్యాటరీ, 31 గంటల బ్యాకప్‌  ఉంటుందని పేర్కొంది.

click me!