ఎంఐ బ్యాండ్ 3i ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకు అది అధికారిక ఎంఐ ఆన్‌లైన్ స్టోర్ లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.కానీ ఇప్పుడు ఎంఐ బ్యాండ్ 3i అకా ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 3i ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఎంఐ బ్యాండ్ 3i పై బ్యాంకింగ్ డిస్కౌంట్, నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్లతో రాబోతుంది.
షియోమి బ్రాండ్ తాజాగా కొత్త బడ్జెట్ ఫిట్‌నెస్ బ్యాండ్ ఎంఐ బ్యాండ్ 3i గత నెలలో భారతదేశంలో ప్రారంభించారు. ఎంఐ బ్యాండ్ 3i ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకు అది అధికారిక ఎంఐ ఆన్‌లైన్ స్టోర్ లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.
కానీ ఇప్పుడు ఎంఐ బ్యాండ్ 3i అకా ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 3i ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. అయితే డిసెంబర్ 16 నుండి భారతదేశంలో కొన్ని ఆఫర్లతో దీనిని ప్రవేశపెట్టబోతున్నారు. ఎంఐ బ్యాండ్ 3i టచ్-సెన్సిటివ్ OLED డిస్ ప్లేతో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 20 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
also read జియోక్స్ నుంచి పవర్ ఫుల్, రిమోట్ కంట్రోల్డ్ స్పీకర్
అధికారిక షియోమి ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ ఒక ట్వీట్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో ఎంఐ బ్యాండ్ 3i లాంచ్ వివరాలను తెలిపింది. ఎంఐ బ్యాండ్ 3i ధర ప్రస్తుతం రూ. 1,299, డిసెంబర్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ‘అవుట్ ఆఫ్ స్టాక్’ గా చూపిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం ఆన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 5 శాతం ఆఫ్ ఇంకా జీరో ఇఎంఐ కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. ఎంఐ బ్యాండ్ 3i 5ATM స్టాండర్డ్ సర్టిఫై పొందింది. థర్మోప్లాస్టిక్ పాలియురేతేన్ (టిపియు) తో దీనిని బిల్డ్ చేశారు. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 3i అని కూడా పిలువబడే షియోమి ఫిట్‌నెస్ బ్యాండ్, 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 0.78-అంగుళాల (128x80 పిక్సెల్స్) OLED డిస్‌ప్లే, యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ తో కెపాసిటివ్ టచ్ ప్యానెల్‌తో రాబోతుంది.
also read కంప్యూటర్ నుంచే ఎవరికైనా కాల్స్ చేసుకోవచ్చు...ఎలా అనుకుంటున్నరా...?
ఇది 110 ఎంఏహెచ్ లి-పాలిమర్ బ్యాటరీని ఇందులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జీ చేస్తే 20 రోజుల వరకు ఉంటుందని తెలిపారు. ఎంఐ బ్యాండ్ 3iలో హార్ట్ బీట్ సెన్సార్ ఫీచర్ ఉండదు. ఎంఐ బ్యాండ్ 3i ఆండ్రాయిడ్ 4.4 లేదా అంతకంటే ఎక్కువ అప్ డేట్ ఉన్న, iOS 9.0 లేదా అంతకంటే ఎక్కువ అప్ డేట్ ఫోన్‌లకు అనుకూలంగా ఉంటుంది.
ఇందులో వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ V4.2, ఎంఐ ఫిట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లకు, టాబ్లెట్‌లకు కనెక్ట్ అవుతుంది. ఎంఐ బ్యాండ్ 3i ఫీచర్లలో కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్‌లు, ఈవెంట్ రిమైండర్‌లు ఇంకా మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. దాని ఫిట్‌నెస్-సెంట్రిక్ సామర్థ్యాల గురించి చెప్పాలంటే సైక్లింగ్, రన్నింగ్ వాకింగ్ వంటి ఆక్టివిటీస్ ఇది ట్రాక్ చేస్తుంది. ఎంఐ బ్యాండ్ 3i లో స్లీప్ ట్రాకింగ్, వాతావరణ సూచనలను కూడా అందిస్తుంది.