జియోక్స్ నుంచి పవర్ ఫుల్, రిమోట్ కంట్రోల్డ్ స్పీకర్‌

By Sandra Ashok KumarFirst Published Dec 13, 2019, 5:48 PM IST
Highlights

జియోక్స్ ఒక కొత్త స్పీకర్ ను విడుదల చేసింది. దీనికి 'రోర్' పేరు పెట్టారు. ఇందులో బ్లూటూత్ స్పీకర్, 8-inch పొడవైన సబ్‌ వూఫర్‌తో 120W అవుట్‌పుట్ సౌండ్ ఇస్తుంది.

భారతదేశంలో టీవీ సెగ్మెంట్ విజయవంతంగా ప్రారంభించిన తరువాత, జియోక్స్ ఒక కొత్త స్పీకర్ ను విడుదల చేసింది. దీనికి 'రోర్' పేరు పెట్టారు. ఇందులో బ్లూటూత్ స్పీకర్, 8-inch పొడవైన సబ్‌ వూఫర్‌తో 120W అవుట్‌పుట్ సౌండ్. సన్ ఎయిర్‌వాయిస్ గ్రూప్‌లో భాగమైన జియోక్స్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు 2.1, 4.1, టవర్ అండ్ ట్రాలీ స్పీకర్లతో ఆడియో సెగ్మెంట్ లోకి ప్రవేశించింది. అవుట్డోర్ పార్టీల కోసం రూపొందించిన  ‘రోర్’ వైర్‌లెస్ బ్లూటూత్ ట్రాలీ స్పీకర్  గొప్ప అనుభూతిని ఇస్తుంది.

ట్రాలీ డిజైన్ స్పీకర్లను మీరు ఎక్కడికి వెళ్లినా తెసుకెళ్లవచ్చు. కాంపాక్ట్ డిజైన్, పోర్టబుల్ గా దీనిని రూపొందించారు. ఇందులో 2000mAh ఇన్‌బిల్ట్ బ్యాటరీని అమర్చారు. బీట్ కంట్రోల్‌తో ఆన్-బోర్డు లైటింగ్ ఎఫెక్ట్స్ తో సరిపోయే RGB లైట్స్‌ పార్టీ మూడ్‌ను సెట్ చేస్తుంది.

also read కంప్యూటర్ నుంచే ఎవరికైనా కాల్స్ చేసుకోవచ్చు...ఎలా అనుకుంటున్నరా...?


 ‘రోర్’ ట్రాలీ స్పీకర్‌తో ‘పర్ఫెక్ట్ మ్యూజికల్ పార్టీ మూడ్’ని క్రియేట్ చేసుకోవచ్చు. 3 వే సౌండ్ డిజైన్‌లతో పాటు పవర్‌ఫుల్ బేస్ కోసం 8 ”సబ్‌ వూఫర్స్ ఇందులో ఉన్నాయి.  120W టోటల్ RMS పవర్‌తో తయారు చేయబడిన ఈ స్పీకర్ డీప్ బేస్ తో క్రిస్టల్ క్లియర్ డైనమిక్ మ్యూజిక్ అనుభవాన్ని అందిస్తుంది.

ఇంటర్నల్ యాంప్లిఫైయర్, ఆడియో క్రాస్ఓవర్‌తో సౌండ్  క్లియర్ గా వినిపిస్తుంది. దీనికి వైర్‌లెస్ మైక్ కనెక్టివిటీకి (10 మీ రేంజ్‌తో) కూడా ఉంది.ఆడియో సెగ్మెంట్ లోకి  ప్రవేశంపై జియాక్స్ ఎలక్ట్రానిక్స్ సిఇఒ మిస్టర్ దీపక్ కబు మాట్లాడుతూ “మా విభిన్న స్పీకర్లతో ఆడియో సెగ్మెంట్ లోకి ప్రవేశించడం మాకు చాలా ఆనందంగా ఉంది." అని అన్నారు.

also read స్మార్ట్​ఫోన్ కొందామంటే ధర ఎక్కువని ఆగిపోయారా ? అయితే మీకో శుభవార్త...

బ్యాటరీ గురించి చెప్పాలంటే సుమారు 6-8 గంటల బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుంది. అనేక కనెక్టివిటీ ఫీచర్స్ ఉపయోగించి మ్యూజిక్ ని ట్యూన్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్ సెటప్ చేయడం సులభం, స్పీకర్ బ్లూటూత్ ద్వారా మ్యూజిక్ ప్లే చేయడానికి స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లకు కనెక్ట్ చేయవచ్చు. హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఎమ్‌పి 3 ప్లేయర్‌లను కనెక్ట్ చేయడానికి ఆక్స్ ఇన్పుట్ కేబుల్‌తో వస్తుంది. ఇంకా, ఇది  రేడియో స్టేషన్‌లోను ట్యూన్ చేయడానికి FM సపోర్ట్ తో వస్తుంది.

మాన్యువల్ కంట్రోల్ కాకుండా స్పీకర్ రిమోట్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. ఈ స్పీకర్ ఇప్పటికే భారతదేశంలోని ప్రముఖ రిటైల్ ఇంకా ఆన్‌లైన్ స్టోర్లలో రూ .4,499 ధరతో లభిస్తుంది.
 

click me!