కంప్యూటర్ నుంచే ఎవరికైనా కాల్స్ చేసుకోవచ్చు...ఎలా అనుకుంటున్నరా...?

By Sandra Ashok KumarFirst Published Dec 13, 2019, 12:35 PM IST
Highlights

మైక్రోసాఫ్ట్ మై ఫోన్ యాప్ లో కాలింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది.మై ఫోన్ కాలింగ్ ఫీచర్‌కు మీ ఫోన్‌లో వాడాలంటే ఆండ్రాయిడ్ 7 నౌగాట్ ఓఎస్, బ్లూటూత్ సపోర్ట్ విండోస్ 10 కంప్యూటర్ అవసరం ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ యువర్ ఫోన్ యాప్  కాలింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ విండోస్ ఇన్‌సైడర్ సభ్యులు కొన్ని నెలలు పరీక్షించారు, ఆ తరువాత ఇప్పుడు ఇది  ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఈ ఫీచర్ యువర్ ఫోన్ యాప్ ఉపయోగించి వినియోగదారులను వారి కంప్యూటర్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా  కాల్ హిస్టరి కూడా చూసుకోవచ్చు. 

also read స్మార్ట్​ఫోన్ కొందామంటే ధర ఎక్కువని ఆగిపోయారా ? అయితే మీకో శుభవార్త...

ముఖ్యంగా, ఈ ఫీచర్ వినియోగదారులు కంప్యూటర్ ద్వారా పనిచేసేటప్పుడు వారి ఫోన్‌ లిఫ్ట్ చేసే మాట్లాడటానికి బదులుగా కంప్యూటర్ ద్వారానే కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు.విండోస్ ఇన్సైడర్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా యువర్ ఫోన్ యాప్ కాలింగ్ ఫీచర్ ను మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

ఈ ఫీచర్ కొంతకాలంపాటు టెస్టింగ్ లో ఉంచారు టెస్టింగ్ పూర్తయిన తరువాత ఇప్పుడు ఇది అన్ని విండోస్ 10 వినియోగదారులకు అందుబాటులోకి ఉండేలా తిసుకొచ్చింది.ఈ ఫీచర్ మొదట విండోస్ 10 ప్రివ్యూ బిల్డ్ 18999 ఇన్సైడర్స్ (20 హెచ్ 1) తో అక్టోబర్‌లో వచ్చింది. ప్రజలకు అందుబాటులోకి రాకముందు కొన్ని నెలలు దీనిపై టెస్టింగ్ నిర్వహించారు.

also read సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్‌...ఎక్కడి నుంచైనా ఆన్ ఆఫ్ చేయవచ్చు...

యూజర్లు ఇప్పుడు యువర్ ఫోన్ యాప్ ద్వారా, మీ ఫోన్‌లో ఇన్‌కమింగ్ కాల్‌లకు సమాధానం ఇవ్వడానికి కంప్యూటర్ లోని యువర్ ఫోన్ యాప్ ఉపయోగించి ఆన్సర్ చేయవచ్చు. యాప్ లో ఉన్న కాల్ డయలర్‌ను ఉపయోగించి మీరు కాల్స్ చేయవచ్చు. మీరు ఏదైన కాల్‌కు సమాధానం ఇవ్వకూడదనుకుంటే, మీరు ఈ ఫోన్ కాల్‌లను కంప్యూటర్ ద్వారా కట్ చేయవచ్చు. 

ఈ కాలింగ్ ఫీచర్‌ను ఉపయోగించడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి యువర్ ఫోన్ యాప్ ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అయితే మీ ఫోన్ ఆండ్రాయిడ్ 7 నౌగాట్ ఓఎస్ అయి ఉండాలి. విండోస్ 10 కంప్యూటర్ కి బ్లూటూత్ సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది.

click me!