వై-ఫై రేంజ్ ఎక్స్‌టెండర్: ఈ డివైజ్ ఇంటర్నెట్ స్పీడ్ ని సూపర్‌ఫాస్ట్‌గా చేస్తుంది..స్పెషాలిటీ ఎంటో తెలుసా..?

Published : Aug 22, 2022, 04:26 PM ISTUpdated : Aug 22, 2022, 04:35 PM IST
 వై-ఫై రేంజ్ ఎక్స్‌టెండర్: ఈ డివైజ్ ఇంటర్నెట్ స్పీడ్ ని సూపర్‌ఫాస్ట్‌గా చేస్తుంది..స్పెషాలిటీ ఎంటో తెలుసా..?

సారాంశం

మీరు కూడా స్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోని ప్రతి మూలకు సూపర్‌ఫాస్ట్ స్పీడ్ తో కనెక్షన్ కోరుకుంటున్నారా అయితే ఈ వార్తా కోసం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టె ఒక డివైజ్ గురించి మీకోసం.

డిజిటల్ ప్రపంచంలో మంచి ఇంటర్నెట్ స్పీడ్ చాలా ముఖ్యం. కొన్నిసార్లు హై స్పీడ్ కనెక్షన్ Wi-Fi రూటర్ నుండి మంచి ఇంటర్నెట్ స్పీడ్ కనెక్టివిటీ అందుబాటులో ఉండదు. అలాంటి సమయంలో మీ వర్క్ ప్రభావితం కావొచ్చు. మీరు కూడా స్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోని ప్రతి మూలకు సూపర్‌ఫాస్ట్ స్పీడ్ తో కనెక్షన్ కోరుకుంటున్నారా అయితే ఈ వార్తా కోసం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టె ఒక డివైజ్ గురించి మీకోసం, దీని సహాయంతో మీరు ఇంట్లో ప్రతిచోటా మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందవచ్చు.

నెట్‌గేర్ వై-ఫై రేంజ్ ఎక్స్‌టెండర్
కంప్యూటర్ నెట్‌వర్కింగ్ కంపెనీ నెట్‌గేర్ నుండి వస్తున్న నెట్‌గేర్ EX6110 AC1200 వై-ఫై రేంజ్ ఎక్స్‌టెండర్ మీ ఇంటిలో ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడానికి బెస్ట్ ఆప్షన్. ఈ డివైజ్ ని అమెజాన్ నుండి రూ. 2,424 ధరతో కొనుగోలు చేయవచ్చు. మంచి బిల్ట్ క్వాలిటీతో ఈ డివైజ్ లో డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ ఉంది. దీంతో మీరు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1200 Mbps వరకు డేటా స్పీడ్ సపోర్ట్ పొందుతారు. 

TP-Link TL-WA850RE N300 వైర్‌లెస్ రేంజ్ ఎక్స్‌టెండర్ 
మీరు ఈ డివైజ్ ని Amazon నుండి కూడా కొనుగోలు చేయవచ్చు, దీని ధర కేవలం రూ.1,399. TP-Link TL-WA850RE N300 వైర్‌లెస్ రేంజ్ ఎక్స్‌టెండర్‌తో మీరు గరిష్టంగా 300 Mbps డేటా స్పీడ్ అండ్ మంచి లిమిట్ పొందుతారు. స్మార్ట్ సిగ్నల్ ఇండికేటర్ లైట్ ఇంకా నైట్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఈ డివైజ్ లో ఉన్నాయి. 

Inamax USB WiFi అడాప్టర్ 
మీరు ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తే Inamax USB WiFi అడాప్టర్ మీకు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. దీని సహాయంతో మెరుగైన ఇంకా హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ డివైజ్ సహాయంతో డేటా స్పీడ్ 1200 Mbps వరకు ఉంటుంది. ఇంకా USB 3.0 అండ్ డ్యూయల్ బ్యాండ్ (2.4G/5G 802.11ac)కి సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఈ డివైజ్ కాంపాక్ట్ ఇంకా దీని బరువు 80 గ్రాములు మాత్రమే. Inamax USB WiFi అడాప్టర్ ని అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. 
 

PREV
click me!

Recommended Stories

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?
కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్