సినిమాలు, షోల సమయంలో నెట్‌ఫ్లిక్స్ ఇక వాటిని చూపించదు.. త్వరలో కొత్త ప్లాన్‌లు..

By asianet news telugu  |  First Published Aug 22, 2022, 12:09 PM IST

ఈ సంవత్సరం జూన్‌లో నెట్‌ఫ్లిక్స్ తక్కువ ఖర్చుతో కూడిన కొన్ని కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడతామని తెలిపింది. ఈ ప్లాన్‌లతో కస్టమర్‌లకు యాడ్స్ కనిపిస్తాయి. యాడ్స్ ఆధారిత ప్లాన్ కోసం నెట్‌ఫ్లిక్స్ మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం  చేసుకుంది. 


ఆన్-డిమాండ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పెద్ద నిర్ణయం తీసుకుంది. పిల్లల సినిమాలు, షోల సమయంలో యాడ్స్ చూపించబోమని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. దీనిని టెక్ క్రంచ్ నివేదిక మొదట క్లెయిమ్ చేసినప్పటికీ స్ట్రేంజర్ థింగ్స్, బ్రిడ్జర్టన్ అండ్ స్క్విడ్ గేమ్ వంటి ఒరిజినల్ షోలలో ప్రకటనలు కనిపిస్తాయని చెప్పింది.

అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అండ్ ఇతర సంస్థలు పిల్లల కోసం యాడ్స్ నిబంధనలకు లోబడి ఉండాలని డిమాండ్ చేశాయి. నెట్‌ఫ్లిక్స్ సంవత్సరానికి $4 బిలియన్లను యాడ్స్ సేల్స్ ద్వారా ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు, దీంతో ఇంటర్నెట్ వీడియో యాడ్స్ లీడింగ్ ప్లేయర్స్ లో నెట్‌ఫ్లిక్స్  ఒకటిగా నిలిచింది.

Latest Videos

undefined

పిల్లలకు అందిస్తున్న కంటెంట్ గురించి YouTube కూడా తెలుసుకుంది. పిల్లలకు సంబంధించిన సమాచార కలెక్షన్స్ YouTube పరిమితం చేస్తుంది.  అంతేకాకుండా, యూట్యూబ్ కంటెంట్ కోసం పిల్లల తల్లిదండ్రుల నుండి కూడా సమ్మతి తీసుకోబడుతుంది. పిల్లల గురించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినందుకు 2019లో యూట్యూబ్‌కి US ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (FTC) $170 మిలియన్ జరిమానా విధించింది.

ఈ సంవత్సరం జూన్‌లో నెట్‌ఫ్లిక్స్ తక్కువ ఖర్చుతో కూడిన కొన్ని కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడతామని తెలిపింది. ఈ ప్లాన్‌లతో కస్టమర్‌లకు యాడ్స్ కనిపిస్తాయి. యాడ్స్ ఆధారిత ప్లాన్ కోసం నెట్‌ఫ్లిక్స్ మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం  చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్  అడ్వర్టైజింగ్ మోడల్ ఈ సంవత్సరం చివరి నాటికి పరిచయం చేయబడుతుందని లేదంటే 2023 ప్రారంభంలో ఉంటుందని భావిస్తున్నారు.

ఇంకా నెట్‌ఫ్లిక్స్ నిరంతరం నష్టాలను చవిచూస్తోంది, దీంతో కంపెనీ ఇప్పుడు యాడ్స్ ఆధారిత ప్లాన్స్ పరిశీలిస్తోంది. మరోవైపు భారత మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్ పట్టు బలహీనపడుతోంది. భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి నెట్‌ఫ్లిక్స్ గట్టి పోటీని ఎదురుకొంటుంది.

click me!