యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు: క్లారీటి ఇచ్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ప్రజల అభిప్రాయాన్ని కోరిన ఆర్‌బి‌ఐ..

By asianet news telugu  |  First Published Aug 22, 2022, 1:22 PM IST

గతంలో రిజర్వ్ బ్యాంక్ UPI నుండి చెల్లింపులపై ఛార్జీలు విధించాలని సూచించింది. ఈ మేరకు  సెంట్రల్ బ్యాంకు చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఈ చర్చా పత్రంపై రిజర్వ్ బ్యాంక్ సాధారణ ప్రజల అభిప్రాయాన్ని కోరింది.


యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)పై ఛార్జీలు విధిస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది. UPI అనేది ప్రజలకు ఉపయోగకరమైన డిజిటల్ సర్వీస్ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. 

యూపీఐ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన సర్వీస్ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. దీని ద్వారా ప్రజలకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది. అలాగే ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకతను కూడా పెంచుతుంది. UPI సేవలపై ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచనలో ప్రభుత్వం లేదు. కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చవలసి ఉన్నందున యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలపై ప్రభుత్వం ఎటువంటి ఛార్జీలు విధించదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Latest Videos

undefined

గతంలో రిజర్వ్ బ్యాంక్ UPI నుండి చెల్లింపులపై ఛార్జీలు విధించాలని సూచించింది. ఈ మేరకు  సెంట్రల్ బ్యాంకు చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఈ చర్చా పత్రంపై రిజర్వ్ బ్యాంక్ సాధారణ ప్రజల అభిప్రాయాన్ని కోరింది. ఈ చర్చా పత్రంలో UPI ద్వారా చెల్లింపులు చేయడంపై ఛార్జీలు విధించడం గురించి కూడా చర్చించింది.

భారతదేశంలో RTGS అండ్ NEFT పేమెంట్ వ్యవస్థలు RBI యాజమాన్యంలో నిర్వహించబడతాయి. IMPS, RuPay, UPI మొదలైన సిస్టమ్‌లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యాజమాన్యంలో నిర్వహించబడుతున్నాయి, ఇవి బ్యాంకులచే ప్రమోట్ చేయబడిన లాభాపేక్ష లేని సంస్థ.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్చా పత్రంలో UPI ఫండ్ ట్రాన్సఫర్ వ్యవస్థగా డబ్బు రియల్ టైమ్  ట్రాన్స్ఫర్మ్ నిర్ధారిస్తుంది. పేమెంట్ పూర్తి ప్రక్రియను నిర్ధారించడానికి PSOలు అండ్ బ్యాంకులు అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఖర్చు చేయాలి, తద్వారా లావాదేవీలు ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రాసెస్ చేయబడతాయి. 

UPIతో పాటు, డెబిట్ కార్డ్ లావాదేవీలు, RTGS, NEFT మొదలైన సేవలపై ఛార్జీలు విధించడంపై రిజర్వ్ బ్యాంక్ ప్రజల అభిప్రాయాన్ని కూడా కోరింది. డెబిట్ కార్డ్ పేమెంట్ సిస్టమ్, ఆర్‌టిజిఎస్ పేమెంట్ సిస్టమ్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్) అండ్ ఎన్‌ఇఎఫ్‌టి (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులపై ఛార్జీలు విధించడం అసమంజసమైనది కాదని ఆర్‌బిఐ తెలిపింది.  

click me!