వాట్సాప్‌ కొత్త ఫీచర్.. ఇప్పుడు టైపింగ్ అవసరం లేకుండానే మెసేజెస్ పంపొచ్చు..

By Ashok KumarFirst Published Jun 24, 2024, 10:01 PM IST
Highlights

కొత్త ట్రాస్క్రైబ్ అప్షన్  ద్వారా రికార్డ్ చేసిన వాయిస్ మెసేజెస్  టెక్స్ట్‌గా మార్చడానికి, అనువదించడానికి ఉపయోగపడే కొత్త ఫీచర్ వచ్చేసింది. ఈ ఫెసిలిటీ మొదట్లో హిందీ, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, ఇంగ్లీషుతో సహా  అందుబాటులో ఉంటుంది.

వాట్సాప్‌లో వాయిస్  మెసేజెస్  మనం సాధారణంగా  ఉపయోగించే వాటిలో ఒకటి, ఎందుకంటే కొందరు టైప్ చేయడానికి అంతగా ఇష్టపడరు. కానీ చాలా మంది ఈ వాయిస్ నోట్స్ వినే పరిస్థితుల్లో  ఉండరు. టెక్స్ట్  మెసేజెస్ చూడటానికి చాలా ఈజీ. దింతో  మెసేజ్‌లు పంపడం, చదవడం ఇద్దరికీ సింపుల్  అవుతుంది. కానీ  కొత్త ట్రాస్క్రైబ్ అప్షన్  ద్వారా రికార్డ్ చేసిన వాయిస్ మెసేజెస్  టెక్స్ట్‌గా మార్చడానికి, అనువదించడానికి ఉపయోగపడే కొత్త ఫీచర్ వచ్చేసింది. ఈ ఫెసిలిటీ మొదట్లో హిందీ, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, ఇంగ్లీషుతో సహా  అందుబాటులో ఉంటుంది.

ఈ ఫీచర్ WhatsApp 2.24.7.8 Android బీటా వెర్షన్‌లో టెస్టింగ్ చేస్తున్నారు. యాప్‌లో వాయిస్ ట్రాన్స్‌క్రిప్ట్ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి  అప్షన్  వస్తుంది. దింతో యాప్ వాయిస్ మెసేజెస్  ట్రాస్క్రైబ్ చేయగలదు. ఈ ఫీచర్ ప్రాసెసింగ్ ఫోన్‌లోనే జరుగుతుంది. వాయిస్ మెసేజెస్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సర్క్యూరిటీ చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

Latest Videos

తాజాగా WhatsApp  ఫోటోలను, వీడియోలను పంపే వారికి సహాయపడే ఒక అప్ డేట్ పరిచయం చేసింది. దీని ద్వారా పంపిన ఫైల్ మీడియా క్వాలిటీ  ప్రీసెట్ చేయడానికి  ఒక గొప్ప అప్షన్. ఈ ఫీచర్  ప్రతి ఫైల్‌కు HD మోడ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సిన  అవసరాన్ని లేకుండా చేస్తుంది. దీని కోసం మీడియా అప్‌లోడ్ క్వాలిటీ ఆప్షన్‌కి వెళ్లి HD అప్షన్  సెలెక్ట్ చేసుకొని సెట్ చేయండి. యాప్‌ ఓపెన్ చేసి  సెట్టింగ్‌లలో స్టోరేజ్ అండ్  డేటా అప్షన్  సెలెక్ట్ చేసుకోండి. మీకు 'మీడియా అప్‌లోడ్ క్వాలిటీ' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో స్టాండర్డ్ క్వాలిటీ లేదా  హెచ్‌డి క్వాలిటీ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. వీటి నుండి HD క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈజీ  ఆవుతాయి.

click me!