మైక్రోసాఫ్ట్, గూగుల్ క్రోమ్ యూజర్లకు అలెర్ట్.. క్లిక్ చేస్తే అంతే !

By Ashok KumarFirst Published Jun 20, 2024, 7:45 PM IST
Highlights

మైక్రోసాఫ్ట్ వర్డ్ లాగా కనిపించే ఈ మాల్వేర్ క్రోమ్ వంటి బ్రౌజర్‌లకు అప్‌డేట్ లాగా వ్యాపిస్తుంది. ఈ హానికరమైన ఫైల్స్ సెట్‌ను డౌన్‌లోడ్ చేసే యూజర్లు  హ్యాకింగ్ కి గురవుతారని కూడా చెబుతోంది.
 

 యూజర్లను దోచుకోవడానికి హ్యాకర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను కనుగొంటున్నారు. లేటెస్ట్ డిజిటల్ సర్వీసెస్  వినియోగించే యూజర్లు కూడా మాల్వేర్ బారిన పడుతున్నారు.

అదే విధంగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ క్రోమ్ లాగా కనిపించే కొత్త, లేటెస్ట్ మాల్వేర్ వ్యాప్తి చెందుతోంది. ఈ మాల్వేర్ మైక్రోసాఫ్ట్ డివైజెస్ యూజర్ల నుంచి డబ్బులను దోచేందుకు రూపొందించినట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Latest Videos

ఆన్‌లైన్ సెక్యూరిటీ సంస్థ ప్రూఫ్‌పాయింట్ మార్చి నుంచి దీని గురించి హెచ్చరిస్తోంది. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఇంకా వెరైటీ విధానాలను సృష్టిస్తున్నారు’ అని పేర్కొంది. ఈ హానికరమైన మాల్వేర్ ఇప్పుడు మరింత వ్యాప్తి చెందుతోందని ప్రూఫ్ పాయింట్ కనుగొంది.

మైక్రోసాఫ్ట్ వర్డ్ లాగా కనిపించే ఈ మాల్వేర్ క్రోమ్ వంటి బ్రౌజర్‌లకు అప్‌డేట్ లాగా వ్యాపిస్తుంది. ఈ హానికరమైన ఫైల్స్ సెట్‌ను డౌన్‌లోడ్ చేసే యూజర్లు  హ్యాకర్ల బారినపడతారని కూడా చెబుతోంది. ట్రోజన్ హార్స్-వైరస్ దాడి క్రిప్టోకరెన్సీలు, సున్నితమైన ఫైల్స్ ఇంకా  వ్యక్తిగత సమాచారం హ్యాక్ చేసేలా  సృష్టించినట్లు  ప్రూఫ్‌పాయింట్ హెచ్చరిస్తుంది.

ఏప్రిల్‌లో కూడా క్లియర్‌ఫేక్ గురించి ప్రూఫ్‌పాయింట్ హెచ్చరించింది. క్లియర్‌ఫేక్ మాల్వేర్ హానికరమైన HTML ఇంకా  జావా స్క్రిప్ట్‌లను నకిలీ బ్రౌజర్ అప్‌డేట్‌ల రూపంలో వెబ్‌సైట్‌లలో ఉంచుతున్నారని నిపుణులు అంటున్నారు.

సైబర్ నేరగాళ్లు నకిలీ క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్‌లను సృష్టించి పవర్‌షెల్ ద్వారా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టల్  చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ హానికరమైన సాఫ్ట్‌వేర్ సైబర్ నేరగాళ్లు క్రిప్టోకరెన్సీ లావాదేవీలను తారుమారు చేయడానికి దారితీస్తుందని చెబుతున్నారు. ఇమెయిల్‌ ద్వారా హానికరమైన HTML ఫైల్‌లను పంపడం ద్వారా కూడా ఇలాంటి హ్యాకింగ్ జరుగుతుంది.

click me!