ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ సేల్.. తక్కువ ధరకే బ్రాండెడ్ ప్రొడక్ట్స్.. కొద్దిరోజులు ఛాన్స్..

By Ashok Kumar  |  First Published Jun 20, 2024, 6:50 PM IST

కస్టమర్‌లు పాత ల్యాప్‌టాప్‌లు, సూపర్‌కాయిన్స్, నో-కాస్ట్ EMI, క్యాష్ ఆన్ డెలివరీ, UPI, క్రెడిట్ & డెబిట్ కార్డ్ పై ఆఫర్స్ ఇంకా ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా పొందవచ్చు.


ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న Flipkart డిస్కౌంట్ సేల్ వచ్చేసింది.  జూన్ 21 నుండి 27 వరకు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ స్టూడెంట్స్ కోసం 'బ్యాక్ టు క్యాంపస్' క్యాంపైన్  ప్రకటించింది. ఈ సేల్ ద్వారా   ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్ , గేమింగ్ కన్సోల్స్, స్మార్ట్‌వాచెస్, మానిటర్లు,  ఇయర్‌ఫోన్స్, ప్రింటర్లు అండ్  హెడ్‌ఫోన్స్  వంటి ఎన్నో ప్రొడక్ట్స్  పాపులర్ బ్రాండ్స్  నుండి తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. 

కస్టమర్‌లు పాత ల్యాప్‌టాప్‌లు, సూపర్‌కాయిన్స్, నో-కాస్ట్ EMI, క్యాష్ ఆన్ డెలివరీ, UPI, క్రెడిట్ & డెబిట్ కార్డ్ పై ఆఫర్స్ ఇంకా ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా పొందవచ్చు. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై రూ. 6000 వరకు అదనంగా  స్టూడెంట్  ఆఫర్స్ కూడా  ఉన్నాయి. అలాగే క్రెడిట్ కార్డ్‌లపై 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్స్ ఉంటాయి. 

Latest Videos

undefined

HP, Asus, Acer వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు రూ.9990 నుండి అంతేకాకుండా బెస్ట్ ప్రాసెసర్‌ ఇంకా గ్రాఫిక్స్ కార్డ్‌తో కూడిన ల్యాప్‌టాప్‌లు  రూ. 45,990 నుండి ప్రారంభ ధరతో ఈ ఆఫర్‌లో భాగంగా ఉంటాయి. 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న  LTE టాబ్లెట్‌లు రూ.9,999 ప్రారంభ ధరకే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. 

BoAt, Sony, Boult వంటి బ్రాండ్  నుండి నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ రూ. 1,499 నుండి  బోల్ట్ క్రౌన్, ఫాస్ట్‌ట్రాక్ రివోల్ట్ FS1 ప్రో, నాయిస్ ఐకాన్ 2 అలాగే  ఫైర్ బోల్ట్ డ్రీమ్ వంటి స్మార్ట్‌వాచ్‌లు రూ. 1,299 ధరతో  ఫ్లిప్‌కార్ట్ బ్యాక్ టు క్యాంపస్‌ ద్వారా  సొంతం చేసుకోవచ్చు. విద్యార్థులు ఇప్పుడు పాత స్మార్ట్‌వాచ్‌ను ఎక్స్చేంజ్  ద్వారా కొత్తదానికి అప్‌గ్రేడ్  కావోచ్చు. 

click me!