వాట్సాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్...ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.

By Sandra Ashok Kumar  |  First Published Dec 11, 2019, 3:01 PM IST

విండోస్ OS ద్వారా నడుస్తున్న అన్ని ఫోన్‌లలో  వాట్సాప్ ఇక పని చేయదు. వాట్సాప్ మెసేజింగ్ యాప్ కొన్ని ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్సాప్ సర్విస్ ను నిలిపివేస్తూనట్లు తెలిపింది.


సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్ ఒకప్పుడు కొన్ని బ్లాక్‌బెర్రీ, నోకియా ఫోన్‌లలో వాట్సాప్ సేవలను 2016 సంవత్సరంలో  ఆపేసింది. ఒక సంవత్సరం తరువాత అంటే 2017లో వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం ఆపరేటింగ్ సిస్టమ్ పాత వెర్షన్‌లో నడుస్తున్న ఆండ్రాయిడ్, విండోస్, ఐఫోన్‌ల నుండి తమ సేవలను నిలివేసింది.

ఇప్పుడు 2019 సంవత్సరం దాదాపుగా ముగుస్తుండడంతో విండోస్ OSతో నడుస్తున్న అన్ని ఫోన్‌లలో ఇంకా పాత OS వెర్షన్‌లలో నడుస్తున్న కొన్ని ఐఫోన్‌లలో, ఆండ్రయిడ్ ఫోన్‌లకు వాట్సాప్ మెసేజింగ్ సర్విస్ ను నిలిపివేయనున్నట్లు తెలిపింది.

Latest Videos

undefined

also read  స్మార్ట్​ఫోన్​కు రక్షణ కల్పించే యూఎస్బీ కండోమ్​ గురించి తెలుసా?


వాట్సాప్ పోస్ట్ చేసిన అధికారిక బ్లాగ్ ప్రకారం మెసేజింగ్ ప్లాట్‌ఫాం అయిన వాట్సాప్  31 డిసెంబర్ 2019 తర్వాత అన్ని విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌(OS) ద్వారా పనిచేసే అన్నీ ఫోన్లలో వాట్సాప్ ఇక పనిచేయదు. నోకియా లూమియా, విండోస్ ఓఎస్‌తో పనిచేసే ఇతర మోడల్ ఫోన్లలో ఇప్పటికీ ఉపయోగించే వారు డిసెంబర్ 31 తరువాత  వాట్సాప్ ఉపయోగించలేరు.  


ఫిబ్రవరి 1, 2020 తర్వాత వెర్షన్ 2.3.7 ఇంకా అంతకంటే  పాత వెర్షన్లు, iOS 7 లేదా అంతకంటే పాత వెర్షన్లలో నడుస్తున్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుందని బ్లాగ్ లో పేర్కొన్నారు."మీరు ఈ ప్రభావిత మొబైల్ పరికరాల్లో ఒకదాన్ని ఉపయోగిస్తుంటే, వాట్సాప్ వాడకాన్ని కొనసాగించడానికి 2016 చివరిలోపు క్రొత్త ఆండ్రాయిడ్, ఐఫోన్ లేదా విండోస్ ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము" అని ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫాం బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

also read సిమ్ కార్డ్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు...ఎలా అంటే ?

 “మేము 2009 లో వాట్సాప్ యాప్ ప్రారంభించినప్పుడు ప్రజలు మొబైల్ డివైజ్ ల వాడకం ఆ రోజు నుండి చాలా భిన్నంగా ఉంది. ఒకప్పుడు విక్రయించిన స్మార్ట్‌ఫోన్‌లలో 70 శాతం బ్లాక్బెర్రీ, నోకియా అందించే ఆపరేటింగ్ సిస్టమ్‌లతోనే నడిచేవి . గూగుల్, ఆపిల్ మరియు మైక్రోసాఫ్ట్ అందించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈ రోజు స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో 99.5 శాతం వాటాను కలిగి ఉంది”

ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్లు సరికొత్త OS తో నడుస్తున్నాయి. వినియోగదారులకు చాలా మెరుగైన అనుభవాన్ని అందించడానికి వాట్సాప్ ఇప్పుడు చాలా మంది ఉపయోగించే మొబైల్ ఫోన్ ప్లాట్‌ఫారమ్‌లపై దృష్టి పెట్టాలని కోరుకుంటుంది.అందుకే ఈ నిర్ణయం తెసుకుంటుంది అని తెలిపారు.

click me!