వాట్సాప్ యూజర్లకు కూడా కొత్త రూల్.. ఇలా చేస్తే జైలు శిక్ష లేదా జరిమానా..?

By asianet news teluguFirst Published Sep 29, 2022, 1:08 PM IST
Highlights

మీరు వాట్సాప్, సిగ్నల్ లేదా టెలిగ్రామ్‌లో మీ గుర్తింపును దాచిపెట్టి ఎవరితోనైనా చాట్ చేస్తే ఈ చట్టం వర్తిస్తుంది అలాగే మీరు జైలు శిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

సిమ్ కార్డ్‌తో మీ గుర్తింపును దాచడం ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నకిలీ గుర్తింపు కార్డుతో సిమ్ కార్డ్ ఉంటే మీరు జైలు శిక్ష ఇంకా రూ.50 వేల వరకు జరిమానా కూడా విధించవచ్చు. అంతేకాకుండా మీరు వాట్సాప్, సిగ్నల్ లేదా టెలిగ్రామ్‌లో మీ గుర్తింపును దాచిపెట్టి ఎవరితోనైనా చాట్ చేస్తే ఈ చట్టం వర్తిస్తుంది అలాగే మీరు జైలు శిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త చట్టాన్ని వివరంగా తెలుసుకుందాం...

ఒక నివేదిక ప్రకారం, ఇప్పుడు ఇలాంటి నిబంధన వల్ల సైబర్ నేరాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. టెలికాం బిల్లులోని సెక్షన్ 7లోని సబ్-సెక్షన్ 4 కస్టమర్లు వారి నిజమైన గుర్తింపును ఎల్లవేళలా బహిర్గతం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తప్పుడు గుర్తింపు లేదా గుర్తింపును దాచిపెట్టడం అనేది రూ. 50,000 వరకు జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుంది. 

ఇలాంటి సందర్భంలో పోలీసులు మిమ్మల్ని వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు ఇంకా కోర్టు ఉత్తర్వులు లేకుండా దర్యాప్తు ప్రారంభించవచ్చని కూడా ముసాయిదా బిల్లు పేర్కొంది. ఆన్‌లైన్ ఆర్థిక మోసాల సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని, వాట్సాప్-సిగ్నల్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల వినియోగదారులు కూడా KYC ఫార్మాలిటీలను తప్పనిసరిగా చేయవలసి ఉంటుందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 6-10 నెలల్లో టెలికాం బిల్లు అమలులోకి వస్తుందని చెప్పారు.

అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ కాల్ చేయడానికి లేదా ఏదైనా రకమైన కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే అన్ని యాప్‌లు కొత్త టెలికాం బిల్లు కిందకు వస్తాయని అయితే ప్రభుత్వం యూజర్ల మెసేజెస్ అంటే మెసేజెస్ లేదా కాల్స్ డీక్రిప్ట్ చేయదని స్పష్టం చేశారు. ఫోన్ కాల్ రిసీవర్‌కు ఎవరు కాల్ చేశారు, అతని గుర్తింపు ఏంటి ఎల్లప్పుడూ తెలుసుకోవాలని ఆయన అన్నారు.
 

click me!