ఈ విభాగంలో దేశీయ కంపెనీ ట్రూక్ స్మార్ట్‌వాచ్ ట్రూక్ హారిజన్‌ను తీసుకొచ్చింది. ఖచ్చితమైన పొజిషన్ క్లెయిమ్ చేసే ట్రూక్ హారిజన్‌లో జిపిఎస్ సపోర్ట్ ఉంది. ట్రూక్ హారిజన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 899కి లిస్ట్ అయింది.
గత కొద్ది రోజులుగా జిపిఎస్, కాలింగ్ ఫీచర్‌తో వస్తున్న స్మార్ట్‌వాచ్‌లకు డిమాండ్ పెరిగింది. చాలా కంపెనీలు బడ్జెట్, ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లలో ఇలాంటి స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఈ విభాగంలో దేశీయ కంపెనీ ట్రూక్ స్మార్ట్‌వాచ్ ట్రూక్ హారిజన్‌ను తీసుకొచ్చింది. ఖచ్చితమైన పొజిషన్ క్లెయిమ్ చేసే ట్రూక్ హారిజన్‌లో జిపిఎస్ సపోర్ట్ ఉంది. ట్రూక్ హారిజన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 899కి లిస్ట్ అయింది, అయితే దీని అసలు ధర రూ. 2,999.
ట్రూక్ హారిజన్ ఫీచర్స్
అడ్వెంచర్స్ చేయాలనుకునే వారి కోసం ట్రూక్ హారిజన్ ప్రత్యేకంగా పరిచయం చేసారు. ట్రూక్ హారిజన్‌తో ఇంటర్నల్ GPS, GLONASS అందించారు. అంతేకాకుండా, ట్రూక్ హారిజన్ వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్ పొందింది. ఇందులో చాలా స్పోర్ట్స్ మోడ్‌లు కూడా ఇచ్చారు. ట్రూక్ హారిజన్ బ్యాటరీ 45 రోజుల స్టాండ్‌బై, సాధారణ ఉపయోగంలో ఏడు రోజుల బ్యాకప్ ఉంటుందని క్లెయిమ్ చేశారు.
ట్రూక్ హారిజన్ కి 1.69-అంగుళాల హెచ్‌డి టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 ఇచ్చారు. అంతేకాకుండా 24x7 హార్ట్ బీట్ మానిటర్, బ్లడ్ ప్రేజర్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ (SpO2), స్లీప్ మానిటర్‌తో పెడోమీటర్ వంటి హెల్త్ ఫీచర్స్ ఉన్నాయి. ట్రూక్ హారిజన్‌లో ఇంటర్నల్ 9-యాక్సిస్ గ్రావిటీ సెన్సార్ ఉంది.
300mAh బ్యాటరీ ఈ వాచ్‌లో అందించారు. Truke Horizonతో మీరు ఫోన్ కెమెరాను కంట్రోల్ చేయవచ్చు, అలాగే ఫోన్‌లో మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు మీరు ఈ వాచ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు అలాగే ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది.