అతితక్కువ ధరకే టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్.. పెద్ద బ్యాటరీ, గొప్ప డిస్‌ప్లేతో లాంచ్..

By asianet news telugu  |  First Published Sep 28, 2022, 1:22 PM IST

టెక్నో పాప్ 6 ప్రో  పోలార్ బ్లాక్, పీస్‌ఫుల్ బ్లూ కలర్‌లో పరిచయం చేశారు. 2 జీబీ ర్యామ్‌తో కూడిన 32 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.7,999. అయితే ఈ ఫోన్‌ను అమెజాన్ ఇండియాలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కింద రూ.6,099 ధరకు కొనుగోలు చేయవచ్చు.


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో  కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో పాప్ 6 ప్రోను లాంచ్ చేసింది. ఇంతకుముందు టెక్నో పోవా నియో 2 స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఇండియాలో విడుదల చేసింది. టెక్నో పాప్ 6ప్రొని MediaTek Helio A22 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీతో పరిచయం చేసారు. ఈ ఫోన్  2 జి‌బి ర్యామ్ తో 32 జి‌బి వరకు స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. 

టెక్నో పాప్ 6 ప్రో ధర
టెక్నో పాప్ 6 ప్రో  పోలార్ బ్లాక్, పీస్‌ఫుల్ బ్లూ కలర్‌లో పరిచయం చేశారు. 2 జీబీ ర్యామ్‌తో కూడిన 32 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.7,999. అయితే ఈ ఫోన్‌ను అమెజాన్ ఇండియాలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కింద రూ.6,099 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎస్‌బీఐ కార్డు ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1250 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. సెప్టెంబర్ 27 నుండి ఫోన్ సేల్స్ ప్రారంభమయ్యాయి. 

Latest Videos

టెక్నో పాప్ 6 ప్రో స్పెసిఫికేషన్‌లు
టెక్నో పాప్ 6 ప్రో  Android 12 Go ఎడిషన్ HiOS 8.6, 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే, 720×1612 పిక్సెల్‌ రిజల్యూషన్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. క్వాడ్-కోర్ MediaTek Helio A22 ప్రాసెసర్, 2 GB LPDDR4X ర్యామ్‌తో 32 GB eMMC5.1 స్టోరేజ్  లభిస్తుంది.

టెక్నో పాప్ 6 ప్రో కెమెరా
టెక్నో పాప్ 6 ప్రోలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు, ఇందులో ప్రైమరీ కెమెరా 8 మెగాపిక్సెల్స్ అండ్ సెకండరీ కెమెరా AI లెన్స్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాతో పాటు LED ఫ్లాష్ సపోర్ట్ ఇచ్చారు.

టెక్నో పాప్ 6 ప్రో బ్యాటరీ
5000mAh బ్యాటరీ టెక్నో పాప్ 6 ప్రోలో  అందించారు. బ్యాటరీకి సంబంధించి ఫోన్ ఒక్కసారి ఛార్జింగ్‌పై స్టాండ్‌బైతో 42 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుదని కంపెనీ పేర్కొంది. ఫోన్‌లో సెక్యూరిటి కోసం ఫేస్ అన్‌లాక్ కూడా ఉంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS అండ్ OTG వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

click me!