వాట్సాప్ ఆండ్రాయిడ్‌లో కూడా వీడియో కాల్ వెయిటింగ్ ఫీచర్‌ను పొందనుంది. వాట్సాప్ యాప్ కొత్త గ్రూప్ ప్రైవసీ సెట్టింగు, ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్‌ను అప్ డేట్ చేయనుంది.
వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ కోసం కొత్త అప్‌డేట్ తిసుకురాబోతుంది ఇది చాలా ఉపయోగకరమైన ఫీచరని తెస్తుంది. ఇక పై వినియోగదారులు వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతున్నపుడు వేరొకారు మధ్యలో వాట్సాప్ వీడియో కాల్ చేస్తే వారికి కాల్ వెయిటింగ్ వస్తుంది. ఈ ఫీచర్ ఇంతకు ముందు లేదు. అయితే ఇప్పుడు వాట్సప్ వీడియో కాల్ సమయంలో కూడా కాల్ వెయిటింగ్ ఫీచర్ రాబోతుంది.
సెకండ్ ఇన్‌కమింగ్ వాట్సాప్ వీడియో కాల్‌ను డిస్‌కనెక్ట్ చేయడానికి బదులుగా వినియోగదారులు ఇప్పుడు ఒక కాల్ వెయిటింగ్ ని అందుకుంటారు. దానిని మనం అక్సెప్ట్ చెయ్యొచ్చు లేదా రిజెక్ట్ చెయ్యొచ్చు. ఏదేమైనా ఇద్దరు వినియోగదారులు ఒకే కాల్ ఉండలేరు. గత నెల చివర్లో ఐఫోన్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఫీచర్ ఆండ్రాయిడ్ రెండింటికీ అందుబాటులోకి వస్తుంది.
undefined
also read ఆపిల్ క్లిప్స్ యాప్ లో కొత్త ఫిచర్
వాట్సాప్ కొత్త అప్ డేట్ బీటా మరియు ఆండ్రాయిడ్ ఛానెల్‌ల కోసం తాజా అప్ డేట్ కాల్ వెయిటింగ్ ఫీచర్‌ను తెస్తుంది. ఇది ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా లభిస్తుంది. అలాగే వాట్సాప్ గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్, వాట్సాప్ యప్ ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ అప్ డేట్ కూడా వస్తుంది. వాట్సాప్‌లోని కాల్ వెయిటింగ్ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ వెర్షన్ 2.19.352 లో, అలాగే వెర్షన్ 2.19.357, బీటా యాప్ వెర్షన్ 2.19.358 లో అందుబాటులో ఉందని తెలిపారు.
ఒకవేళ మీరు ఇంకా యాప్ అప్ డేట్ అందుకోకపోతే మీరు APKMirror ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ చివరలో iOS కోసం వాట్సాప్ v2.19.120 చాట్ స్క్రీన్, కాల్ వెయిటింగ్ ఫీచర్‌తో పాటు వాయిస్‌ఓవర్ మోడ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీ మెసేజ్ బ్రెయిలీ కీబోర్డ్ నుండి నేరుగా పంపించే ఫీచర్ని తీసుకువచ్చింది.
వాట్సాప్ కాల్ వెయిటింగ్ ఎలా పనిచేస్తుంది?
ఆండ్రాయిడ్ యూజర్లు ఒక వాట్సాప్ వీడియో కాల్ మధ్యలో ఉండగా వేరొక వాట్సాప్ వీడియో ఇన్‌కమింగ్ కాల్ వస్తే కాల్ వేటింగ్ ఇకపై చూపిస్తుంది. సాధరణంగా ఏదైనా వీడియో కాల్ ముగిసినప్పుడు వారు మిస్ ఐనా వీడియో కాల్ నోటిఫికేషన్‌ను చూస్తారు. కానీ ఇప్పుడు వినియోగదారులు ఇప్పుడు ఒక వీడియో కాల్ మాట్లాడుతున్నపుడు మరొక వ్యక్తితో ఇన్‌కమింగ్ కాల్‌ను కూడా ఎంచుకోవచ్చు.
also read హువావే నుంచి కొత్త ఫిట్ నెస్ బ్యాండ్ ...ధర ఎంతో తెలుసా ?
వాట్సాప్‌లోని ఇన్‌కమింగ్ కాల్ UI ఇప్పుడు ‘డిక్లైన్’ బటన్‌తో పాటు ‘ఎండ్ & అక్సెప్ట్’ బటన్‌ను చూపిస్తుంది. మీరు ‘డిక్లైన్’ బటన్‌ను నొక్కితే, ఇన్‌కమింగ్ కాల్ కట్ అవుతుంది. మీరు మీ ముందు కాల్‌తో కొనసాగవచ్చు. అయితే మీరు ‘ఎండ్ & అక్సెప్ట్’ బటన్‌ను నొక్కితే కొనసాగుతున్న కాల్ డిస్‌కనెక్ట్ అవుతుంది తద్వారా మీరు సెకండ్ కాల్ వ్యక్తితో మాట్లాడగలరు.
సెల్యులార్ నెట్‌వర్క్ ద్వారా సాధారణ కాల్‌లో కాల్ హోల్డింగ్ లాగా కాకుండా సెకండ్ ఇన్‌కమింగ్ కాల్‌ను హోల్డ్‌లో ఉంచడానికి అలాగే ఒకేసారి ఇద్దరు వ్యక్తులతో లింక్ చేయడానికి వాట్సాప్ అనుమతించదు. మీరు కొనసాగుతున్న వాట్సాప్ కాల్‌తో కంటిన్యూ లేదా సెకండ్ ఇన్‌కమింగ్ కాల్‌ను అంగీకరించడానికి దాన్ని డిస్‌కనెక్ట్ చేయండి.