ఆపిల్ క్లిప్స్ యాప్ లో కొత్త ఫిచర్

By Sandra Ashok Kumar  |  First Published Dec 7, 2019, 3:40 PM IST

ఆపిల్  స్టోర్లో ఉండే ఫ్రీ వీడియో క్రెయేషన్ యాప్ క్లిప్స్ ఇప్పుడు కొత్త అనిమోజీ, మెమోజి ఫీచర్స్ తో ఐఫోన్, ఐప్యాడ్ కోసం అప్ డేట్ చేశారు. ఈ అప్ డేట్ లో యానిమేటెడ్ స్టిక్కర్లు, ఎమోజీలు ఉన్నాయి. ఇవి యాప్ ద్వారా ఫ్రంట్ కెమెరాతో మీ ఫేస్ పై స్టిక్కర్స్, ఎమోజీలను, పెట్టుకొని  నచ్చినట్టు చేసుకోవచ్చు. 


క్లిప్స్ యాప్ అనేది వీడియో ఎడిటింగ్ యాప్. ఇది వీడియో క్లిప్‌లను, ఫోటోలను, వాయిస్ టైటిల్స్స్, స్టిక్కర్లు, మ్యూజిక్  మరెన్నో ప్రత్యేకమైన వీడియోలను క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.ఆపిల్  స్టోర్లో ఉండే ఫ్రీ వీడియో క్రెయేషన్ యాప్ క్లిప్స్ ఇప్పుడు కొత్త అనిమోజీ, మెమోజి ఫీచర్స్ తో ఐఫోన్, ఐప్యాడ్ కోసం అప్ డేట్ చేశారు.

also read  నోకియా నుండి తొలి స్మార్ట్ టీవీ: ఆవిష్కరించిన ఫ్లిప్‌కార్ట్

Latest Videos

undefined

ఈ అప్ డేట్ లో యానిమేటెడ్ స్టిక్కర్లు, ఎమోజీలు ఉన్నాయి. ఇవి యాప్ ద్వారా ఫ్రంట్ కెమెరాతో మీ ఫేస్ పై స్టిక్కర్స్, ఎమోజీలను, పెట్టుకొని  నచ్చినట్టు చేసుకోవచ్చు. "యూజర్లు ఇప్పుడు పర్సనల్ వీడియో మెసేజ్లు, స్లైడ్‌షోలు, స్కూల్ ప్రాజెక్టులు, మినీ  మూవీస్ లాంటివి షేర్  చేసుకోవచ్చు ”అని కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది

.కొత్త అప్ డేట్ మిక్కీ మౌస్, మిన్నీ మౌస్ కొత్త స్టిక్కర్లతో పాటు, వింటర్ న్యూ పోస్టర్‌ను కూడా ఇందులో ఉన్నాయి. క్లిప్‌లలో అనిమోజీ, మెమోజిని ఉపయోగించటానికి ట్రూడెప్త్ కెమెరా ఉన్న డివైజ్ అవసరం ఉంటుంది.ఇది వీడియో క్లిప్‌లు,  ఫోటోలను, వాయిస్-టైటిల్స్, స్టిక్కర్లు, మ్యూజిక్ ఇంకా మరిన్నింటితో కలిపి ప్రత్యేకమైన వీడియోలను సృష్టించడానికి , సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడానికి  అనుమతిస్తుంది. 

also read  ఇలాగైతే వొడాఫోన్‌ ఐడియా మూసివేయాల్సి వస్తుంది...?

క్లిప్‌ 2.1 యాప్ స్టోర్‌లో ఫ్రీ అప్ డేట్ గా లభిస్తుంది మరియు ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ ఎస్‌ఇ,  ఐప్యాడ్ ఎయిర్ 2, ఐపాడ్ టచ్ (7జెన్), iOS 13 లలో లేదా దీని  తరువాత మోడళ్లలో  అప్ డేట్ గా లభిస్తుంది.సెల్ఫీ సీన్స్ ఫీచర్‌తో పాటు కొత్త అనిమోజీ, మెమోజి ఫీచర్లకు ఐఫోన్, ఐప్యాడ్ ప్రోతో పాటు ట్రూడెప్త్ కెమెరాతో అవసరం. 

click me!