వాట్సాప్ మరో గొప్ప ఫీచర్.. ఇప్పుడు మీరు చిటికెలో వాటిని సెర్చ్ చేయవచ్చు..

By asianet news teluguFirst Published Dec 2, 2022, 10:57 PM IST
Highlights

 కంపెనీ ప్రస్తుతం iOS బీటా యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్‌తో చాట్‌లో పాత మెసేజెస్ సులభం అవుతుంది. యూజర్లు యాప్‌లోని పాత మెసేజెస్ డేట్ ప్రకారం చూడవచ్చు.

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ పాత మెసేజ్‌లను డేట్ ప్రకారం చూసేందుకు "సెర్చ్ ఫర్ మెసేజ్ బై డేట్" అనే కొత్త ఆప్షన్ విడుదల చేసింది. వాట్సాప్ గత రెండేళ్లుగా ఈ ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు నివేదించింది, చివరకు ఈ ఫీచర్ బీటా యూజర్లకు విడుదల చేసింది. ఈ ఫీచర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంకా తక్కువ సమయంలో పాత మెసేజెస్ చూడడంలో యూజర్లకు సహాయపడుతుంది. కంపెనీ తాజాగా Message Yourself అనే ఫీచర్‌ను కూడా విడుదల చేసింది. 

డేట్ ద్వారా మెసేజ్   సెర్చ్ 
అయితే, కంపెనీ ప్రస్తుతం iOS బీటా యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్‌తో చాట్‌లో పాత మెసేజెస్ సులభం అవుతుంది. యూజర్లు యాప్‌లోని పాత మెసేజెస్ డేట్ ప్రకారం చూడవచ్చు. అంటే యూజర్లు మొత్తం చాట్‌ను సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా యూజర్లు నేరుగా డేట్ ఎంటర్ చేసే మెసేజెస్ సెర్చ్ చేయవచ్చు.

మీరు ఎలా ఉపయోగించవచ్చాంటే ?
యూజర్లు ఈ ఫీచర్‌లోని సెర్చ్ విభాగంలో కొత్త క్యాలెండర్ సింబల్ పొందుతారు, ఈ  సింబల్ పై నొక్కడం ద్వారా యూజర్లు డేట్ ప్రకారం మెసేజెస్ చూడవచ్చు. లాంగ్ చాట్ హిస్టరీతో ఇబ్బంది పడుతున్న యూజర్లకు ఈ ఫీచర్లు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ గ్రూప్ చాట్ హిస్టరీని చూసేందుకు కూడా సహాయపడుతుంది. 

మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్
Message Yourself ఫీచర్ మల్టీ డివైజ్ సపోర్ట్ గా పరిచయం చేసారు. WhatsApp ఈ కొత్త ఫీచర్ సహాయంతో, మీరు చేయవలసిన పనుల లిస్ట్, షాపింగ్ లిస్ట్, నోట్స్ మొదలైనవాటిని సేవ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన నోట్స్, రిమైండర్‌లు ఇంకా అప్ డేట్స్ గుర్తుంచుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ మెసేజ్స్ మీకు మీరే చేసుకునే సదుపాయాన్ని అందిస్తుంది. 

click me!