ఫాస్టెస్ట్ ప్రాసెసర్‌, 256జి‌బి స్టోరేజ్ తో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్.. ఇండియాలో దీని ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Dec 2, 2022, 10:41 PM IST
Highlights

ఇన్ఫినిక్స్  కొత్త ఫోన్ లో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఐ‌పి‌ఎస్ ఎల్‌సి‌డి LTPS డిస్‌ప్లే లభిస్తుంది, 2460×1080 పిక్సెల్‌  రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్  జీరో సిరీస్ కింద మరో కొత్త ఫోన్ ఇన్ఫినిక్స్  జీరో 5జి 2023ని లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్  జీరో 5జి 2023 మీడియా టెక్ డైమెన్సిటీ 1080 5జి ప్రాసెసర్, 256జి‌బి స్టోరేజ్‌తో పరిచయం చేసారు. ఫోన్‌కి 6.78 అంగుళాల ఫుల్‌హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే అందించారు. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్లు, ధర గురించి...

 ధర 
ఇన్ఫినిక్స్  జీరో 5జి 2023 బ్లాక్, ఆరెంజ్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. ఇన్ఫినిక్స్  జీరో 5జి 2023 ధర $239 వద్ద నిర్ణయించారు అంటే దాదాపు రూ. 19,400. అయితే, ఈ ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయడం పై కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 

ఫీచర్స్ 
ఇన్ఫినిక్స్  కొత్త ఫోన్ లో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఐ‌పి‌ఎస్ ఎల్‌సి‌డి LTPS డిస్‌ప్లే లభిస్తుంది, 2460×1080 పిక్సెల్‌  రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Android 12  XOS 12 లభిస్తుంది. Mali G68 MC4 GPU ఫోన్‌లోని octa-core MediaTek డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఇంకా గ్రాఫిక్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జి‌బి ర్యామ్‌తో కూడిన ఈ ఫోన్‌లో 256 జి‌బి వరకు సోరేజ్ సపోర్ట్ ఉంది. ర్యామ్ ని వర్చువల్‌గా 5జి‌బి వరకు పెంచుకోవచ్చు. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీని 246 వరకు పెంచుకోవచ్చు. 

 కెమెరా
ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే  50-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్,  2-2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మాక్రో సెన్సార్ ఉంది. కెమెరాతో ఎల్‌ఈ‌డి ఫ్లాష్ లైట్ సపోర్ట్ ఇచ్చారు. సెల్ఫీ  అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 

 బ్యాటరీ
5000 mAh బ్యాటరీ ఇన్ఫినిక్స్  జీరో 5జి 2023తో అందించారు, ఇంకా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS / GLONASS USB టైప్-సి పోర్ట్, OTGకి సపోర్ట్ ఉంది. ఫోన్ సెక్యూరిటి కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ కూడా ఉంది. 
 

click me!