కేవలం రూ.999కే 5జి స్మార్ట్‌ఫోన్‌.. 50ఎం‌పి కెమెరా, బిగ్ బ్యాటరీ, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ కూడా..

Published : Dec 02, 2022, 01:43 PM IST
 కేవలం రూ.999కే 5జి స్మార్ట్‌ఫోన్‌.. 50ఎం‌పి కెమెరా, బిగ్ బ్యాటరీ, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ కూడా..

సారాంశం

ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం4 5జి 4జి‌బి ర్యామ్, 64జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999, అయితే 18 శాతం తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ. 12,999కి లభిస్తుంది. ఫోన్‌ కోసం యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది. 

మీరు తక్కువ బడ్జెట్‌లో 5జి స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మీరు తక్కువ ధరకు 5జి స్మార్ట్‌ఫోన్‌ కొనే ఛాన్స్ పొందవచ్చు. చైనా కంపెనీ పోకో ఎం4 5జి ధర రూ. 15,999, అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ ను 18 శాతం డిస్కౌంట్ తో రూ. 12,999కి లభిస్తుంది. ఫోన్‌తో పాటు ఎన్నో ఇతర డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. మీరు అన్ని ఆఫర్‌లను ఉపయోగించుకుంటే మీరు ఫోన్‌ను కేవలం రూ.999 ధరలో పొందవచ్చు. 

పోకో ఎం4 5జిలో ఆఫర్ ఏమిటి?
ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం4 5జి 4జి‌బి ర్యామ్, 64జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999, అయితే 18 శాతం తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ. 12,999కి లభిస్తుంది. ఫోన్‌ కోసం యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది. 

 ఎక్స్ఛేంజ్ ఆఫర్ 
మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఫోన్ కొంటే రూ.12,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ బెనిఫిట్ పాత ఫోన్ కండిషన్ అండ్ బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్, క్యాష్‌బ్యాక్‌తో ఫోన్‌ను ధర రూ.999కి కోనవచ్చు. 

 ఫీచర్లు అండ్ స్పెసిఫికేషన్‌లు
పోకో M4 అనేది 5Gతో కూడిన ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 13. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌, 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్ 3  ప్రొటెక్షన్ కూడా డిస్ ప్లేతో  వస్తుంది.

ఈ Poco ఫోన్‌తో మీరు MediaTek Dimensity 700 ప్రాసెసర్‌, 6జి‌బి వరకు ర్యామ్ ఆప్షన్, 128జి‌బి వరకు UFS 2.2 స్టోరేజీ లభిస్తుంది. దీనితో 2జి‌బి వరకు వర్చువల్ ర్యామ్ కూడా  ఉంటుంది. పోకో M4 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా, ఏడు 5G బ్యాండ్‌ల సపోర్ట్  ఇచ్చారు. హిప్నోటిక్ స్విర్ల్ డిజైన్ లో Poco M4 5G ఉంటుంది. ఈ ఫోన్ వాటర్ ప్రూఫ్ కోసం IP52 రేటింగ్ పొందింది.

PREV
click me!

Recommended Stories

Cheapest Recharge Plan : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ రీచార్జ్ ప్లాన్
Samsung Galaxy S25 Ultra పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 34,000 తగ్గిన ధర