మార్కెట్లోకి వివో బడ్జెట్-బ్యూటీఫుల్ ఫోన్.. హెచ్‌డి ప్లస్ డిస్ ప్లేతో బిగ్ బ్యాటరీ కూడా..

By asianet news teluguFirst Published Nov 29, 2022, 3:30 PM IST
Highlights

పాత మోడల్ వివో వై01 లాగానే వివో ఈ ఫోన్ ని 10 వేల కంటే తక్కువ ధరకే పరిచయం చేసింది. ఈ ఫోన్ ఆర్చిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్‌లలో   అందుబాటులో ఉంటుంది. 

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో  బడ్జెట్ ఫోన్ వివో వై02ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేయబడుతుందని గతంలో నివేదించింది, అయితే దీనిని మొదట ఇండోనేషియాలో ప్రవేశపెట్టారు. వివో వై02ని 5000mAh బ్యాటరీ, 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో తీసుకువచ్చారు. 3జి‌బి ర్యామ్ ఉన్న ఫోన్‌లో 32జి‌బి వరకు స్టోరేజ్ ఆందించారు. వివో వై02 రెండు కలర్స్ ఆప్షన్స్ లో, 8 వేల  కంటే తక్కువ ధరతో పరిచయం చేసారు. ఫోన్‌లోని ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం...

వివో వై02 ధర
పాత మోడల్ వివో వై01 లాగానే వివో ఈ ఫోన్ ని 10 వేల కంటే తక్కువ ధరకే పరిచయం చేసింది. ఈ ఫోన్ ఆర్చిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్‌లలో   అందుబాటులో ఉంటుంది. ఫోన్ ధర $ 95 డాలర్లు(దాదాపు రూ. 7700). అయితే భారత్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేసే విషయాన్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 

 స్పెసిఫికేషన్లు 
 వివో వై02కి 6.51-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐ‌పి‌ఎస్ ఎల్‌సి‌డి డిస్‌ప్లే ఉంది, 720x1600 పిక్సెల్ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 3జి‌బి ర్యామ్‌తో గరిష్టంగా 32జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌ ఇచ్చారు. అయితే మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీని మరింత పెంచుకోవచ్చు. అండ్రాయిడ్ 12 (Go Edition) ఫన్ టచ్ ఓఎస్ 12 వివో Y02తో లభిస్తుంది.

 కెమెరా 
వివో  వై02తో సింగిల్ కెమెరా సెటప్ ఇచ్చారు, దీనిలో 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇచ్చారు. LED ఫ్లాష్ లైట్ కెమెరాతో సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. 

బ్యాటరీ లైఫ్
వివో ఈ కొత్త ఫోన్ లో 5,000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్‌ సపోర్ట్, ఫోన్‌తో 5-వాట్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జి, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, జి‌పి‌ఎస్, మైక్రో యూ‌ఎస్‌బి ఛార్జింగ్ సపోర్ట్ 3.5ఎం‌ఎం ఆడియో జాక్‌ ఉన్నాయి. 
 

click me!