మీ ఇంట్లో సినిమా ఎక్స్పీరియన్స్ కోసం మినీ ప్రొజెక్టర్ .. ధర చాలా తక్కువ ఇంకా డిస్కౌంట్ కూడా..

Published : Nov 28, 2022, 06:45 PM IST
మీ ఇంట్లో సినిమా ఎక్స్పీరియన్స్ కోసం మినీ ప్రొజెక్టర్ .. ధర చాలా  తక్కువ ఇంకా డిస్కౌంట్ కూడా..

సారాంశం

జింక్ నుండి వస్తున్న పోర్టబుల్ ప్రొజెక్టర్ ధర రూ. 5,999, అయితే ఈ ప్రొజెక్టర్‌ను 44 శాతం తగ్గింపుతో రూ. 3,301కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు కోటక్ బ్యాంక్ డెబిట్ కార్ట్ పై ఈ ప్రొజెక్టర్ కొనుగోలు చేస్తే  రూ.1500 వరకు బెనెట్స్ కూడా ఉంటాయి. 

మీరు తక్కువ ధరలో మంచి క్వాలిటీ మినీ ప్రొజెక్టర్‌ను  కోనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీకు గుడ్ న్యూస్. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో మీరు మినీ ప్రొజెక్టర్‌లపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్‌లలో మీరు రూ.3,000 ధర నుండి చిన్న ప్రొజెక్టర్‌ని కొనవచ్చు ఇంకా మీ ఇంట్లో సినిమా అనుభూతిని పొందవచ్చు. ఈ ప్రొజెక్టర్లు, వాటిపై లభించే డిస్కౌంట్ల గురించి తెలుసుకుందాం...

జింక్ (Zync)T300 మినీ ప్రొజెక్టర్
జింక్ నుండి వస్తున్న పోర్టబుల్ ప్రొజెక్టర్ ధర రూ. 5,999, అయితే ఈ ప్రొజెక్టర్‌ను 44 శాతం తగ్గింపుతో రూ. 3,301కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు కోటక్ బ్యాంక్ డెబిట్ కార్ట్ పై ఈ ప్రొజెక్టర్ కొనుగోలు చేస్తే  రూ.1500 వరకు బెనెట్స్ కూడా ఉంటాయి. LED ఇంటర్‌ఫేస్ Zync T300 మినీ ప్రొజెక్టర్‌లో ఉంది. ప్రొజెక్టర్ (800x480 పిక్సెల్స్) రిజల్యూషన్ అండ్ 600 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ప్రొజెక్టర్ సహాయంతో 16-100 అంగుళాల వరకు స్క్రీన్‌ను ఆస్వాదించవచ్చు. అలాగే గరిష్టంగా 10 అడుగుల దూరం వరకు ప్రొజెక్ట్ చేయగలదు. ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్ కి 20,000 గంటల లైట్ లైఫ్  ఉంది.

UNIQUE UC 20 మినీ ప్రొజెక్టర్ 
ఈ మినీ ప్రొజెక్టర్ ధర రూ. 4,500, అయితే 33 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 2,990కి కొనుగోలు చేయవచ్చు. అలాగే సిటీ క్రెడిట్ కార్డ్‌తో కొంటె బ్యాంక్ ఆఫర్ కింద 10 శాతం, గరిష్టంగా రూ. 1,500 వరకు ఆదా చేసుకోవచ్చు. LCD చిప్‌సెట్ మినీ ప్రొజెక్టర్‌లో ఉంటుంది. ప్రొజెక్టర్ సహాయంతో, గరిష్టంగా 4 అడుగుల దూరం వరకు ప్రొజెక్షన్ చేయవచ్చు. ఈ (320x240 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 16:09 యాస్పెక్ట్ రేషియో, 60 ల్యూమన్‌ల బ్రట్ నెస్ లభిస్తుంది. 

VRUM T300 LED మినీ ప్రొజెక్టర్
VRUM నుండి ఈ ఎల్‌ఈ‌డి ప్రొజెక్టర్ ధర రూ. 4,999, అయితే ఫ్లిప్‌కార్ట్‌లో 39 శాతం తగ్గింపుతో దీనిని రూ. 3,013కి కొనుగోలు చేయవచ్చు. ఈ మినీ ప్రొజెక్టర్‌పై ఎన్నో బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. మీరు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే మీరు 10% ఇంకా రూ.1,500 వరకు ఆదా చేయవచ్చు. ఈ మినీ ప్రొజెక్టర్‌తో ఎల్‌ఈడీ సపోర్ట్ కూడా ఉంది. VRUM T300 LED మినీ ప్రొజెక్టర్‌తో గరిష్టంగా 8 అడుగుల దూరం వరకు ప్రొజెక్షన్ చేయవచ్చు, అయితే  1080 పిక్సెల్ రిజల్యూషన్, గరిష్టంగా 3000 ల్యూమెన్‌ల బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని  లైట్ లైఫ్  30000 గంటలు.

PREV
click me!

Recommended Stories

Cheapest Recharge Plan : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ రీచార్జ్ ప్లాన్
Samsung Galaxy S25 Ultra పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 34,000 తగ్గిన ధర