ప్రముఖ నగరాల్లో జియో సర్వీస్ డౌన్.. సోషల్ మీడియాలో కస్టమర్ల ఫిర్యాదులు..

By asianet news teluguFirst Published Nov 29, 2022, 12:35 PM IST
Highlights

ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లో జియో సేవలు నిలిచిపోయాయి. ఈ సమయంలో కస్టమర్లు కాల్స్ ఇంకా ఇంటర్నెట్‌ని ఉపయోగించలేకపోయారు. ముంబైలో జియో సేవలు నిలిచిపోవడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి. 

దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు మంగళవారం దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీనిపై జియో యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు కూడా చేశారు. కస్టమర్ల ప్రకారం, కాలింగ్ అండ్ మెసేజింగ్‌లో సమస్యలు  ఎదురుకొంటున్నట్లు  తెలిపారు. అయితే ఇంటర్నెట్‌ మాత్రం ఉపయోగించగలుగుతున్నారు. తాజాగా FIFA ప్రపంచ కప్  ప్రత్యక్ష ప్రసార సమయంలో, కంపెనీ యాప్ ఆగిపోయింది ఆ తర్వాత Jio కస్టమర్లు ఆగ్రహానికి గురయ్యారని దీంతో Jio సినిమాపై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. Jio సర్వీస్ నిలిచిపోవడం ఇదేం మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా Jio  సర్వీస్ దాదాపు మూడు గంటల పాటు నిలిచిపోయింది. ఈ సమయంలో కస్టమర్లు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. 

ముంబై సర్కిల్‌లో జియో సేవలకు బ్రేక్ 
ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లో జియో సేవలు నిలిచిపోయాయి. ఈ సమయంలో కస్టమర్లు కాల్స్ ఇంకా ఇంటర్నెట్‌ని ఉపయోగించలేకపోయారు. ముంబైలో జియో సేవలు నిలిచిపోవడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి. నివేదిక ప్రకారం, జియో ముంబై సర్కిల్‌లో  నెట్‌వర్క్‌ను షట్ డౌన్ చేసింది. మధ్యప్రదేశ్ యూజర్లు కూడా జియో ఫైబర్‌తో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. 

కస్టమర్ల ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 7 గంటల తర్వాత సేవలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కంపెనీ నుండి ఈ హామీ యూజర్లకు మెసేజ్ ద్వారా అందించబడింది, అయితే బహిరంగంగా Jio ఈ అంతరాయం గురించి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ముంబైలోని రిలయన్స్ జియో వినియోగదారులు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు నాట్ రిజిస్టర్డ్  ఆన్ నెట్ వర్క్ అనే మెసేజ్ అందుకున్నారు.

గతేడాది అక్టోబర్‌లో కూడా 
గతేడాది అక్టోబర్ 6న ఉదయం 9.30 గంటల సమయంలో జియో సేవలు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది యూజర్లు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జియో నెట్‌వర్క్ డౌన్ అయిందని నాలుగు వేల మందికి పైగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీని తర్వాత జియో నెట్‌వర్క్ డౌన్‌పై ఫిర్యాదు చేసే యూజర్ల సంఖ్య వేగంగా పెరిగింది. జియో నెట్‌వర్క్‌లో ఈ సమస్య కారణంగా #JioDown ట్విట్టర్‌లో కూడా ట్రెండింగ్‌గా మారింది.

 జియో ఫైబర్ నెట్‌వర్క్
రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ జియో ఫైబర్ నెట్‌వర్క్ 22 జూన్ 2020న నిలిచిపోయింది, ఈ కారణంగా వినియోగదారులు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది.  అప్పుడు కోవిడ్ టైం ఇంకా ప్రజలు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మధ్యాహ్నాం నుండి ప్రజలకు ఇంటర్నెట్ సమస్యలు మొదలయ్యాయి, ఇంకా మరుసటి రోజు వరకు కొనసాగింది. భారతదేశంలోని చాలా నగరాల్లో జియో ఫైబర్ సర్వీస్ నిలిచింది పోయింది. దీంతో లక్నో, లూథియానా, డెహ్రాడూన్, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ల వినియోగదారులు కూడా నెట్‌వర్క్ అంతరాయం సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. 

click me!