32 జిబి ర్యామ్‌తో వైయో కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. స్టోరేజ్, ఫీచర్స్, ధర తెలుసుకోండి..

By S Ashok KumarFirst Published Feb 19, 2021, 11:23 AM IST
Highlights

 వైయో  తాజాగా  వైయో జెడ్ (2021) ల్యాప్‌టాప్ ను విడుదల చేసింది. వైయో జెడ్ (2021)లో ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఇంటెల్ ఐరిష్ ఎక్స్‌ గ్రాఫిక్స్ తో వస్తుంది.

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోనికి చెందిన వైయో  తాజాగా  వైయో జెడ్ (2021) ల్యాప్‌టాప్ ను విడుదల చేసింది. వైయో జెడ్ (2021)లో ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఇంటెల్ ఐరిష్ ఎక్స్‌ గ్రాఫిక్స్ తో వస్తుంది.

ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల 4 కె రిజల్యూషన్ డిస్ ప్లే ఉంది. రెగ్యులర్ ఎడిషన్‌తో పాటు టెక్స్‌చర్డ్  ఫైబర్‌తో సిగ్నేచర్ ఎడిషన్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.

వైయో జెడ్ (2021) ధర
 వైయో జెడ్ (2021) ప్రారంభ ధర $ 3,579 అంటే ఇండియాలో సుమారు 2,59,900 రూపాయలు. ఈ ధర వద్ద 16 జీబీ ర్యామ్‌తో 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 16 జిబి ర్యామ్‌తో 1 టిబి స్టోరేజ్ ఉన్న మోడల్ ధర $ 3,779, అంటే సుమారు 2,74,400 రూపాయలు.  

also read 

16 జిబి ర్యామ్‌తో 2 టిబి స్టోరేజ్ ధర $ 3,979 అంటే సుమారు రూ .2,88,900, 32 జిబి ర్యామ్‌తో 2 టిబి స్టోరేజ్ మోడల్‌ ధర $ 4,179 ఖర్చు అవుతుంది అంటే సుమారు 3,03,400 రూపాయలు. ప్రస్తుతం యుఎస్‌లో ఈ ల్యాప్‌టాప్ ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే భారతదేశంలో అందుబాటులోకి వస్తుందా అనే దాని పై  ఎలాంటి సమాచారం లేదు.

 వైయో జెడ్ (2021) స్పెసిఫికేషన్లు
వైయో జెడ్ (2021)  విండోస్ 10 ప్రో ఓఎస్ తో  వస్తుంది.  దీనికి 14 అంగుళాల అల్ట్రా హెచ్‌డి 4 కె డిస్‌ప్లేతో  3840x2160 పిక్సెల్‌ల రిజల్యూషన్‌  ఉంటుంది. డిస్ ప్లే కూడా హెచ్‌డిఆర్‌కు సపోర్ట్ చేస్తుంది ఇంకా 180 డిగ్రీల వరకు ఓపెన్ చేయవచ్చు.  

డిస్ ప్లే కూడా తిప్పవచ్చు. ఇందులో ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్, ఇంటెల్ ఐరిష్ ఎక్స్‌ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 32 జీబీ వరకు ఎల్‌పిడిడిఆర్ 4 ర్యామ్, 2 టిబి వరకు ఎస్‌ఎస్‌డి స్టోరేజ్‌ను అందించారు. ఫేస్ డెటెక్షన్ తో  ఫింగర్  ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది.

మంచి ఆడియో కోసం దీనికి డాల్బీ ఆడియో స్టీరియో స్పీకర్ అందించారు. కనెక్టివిటీ గురించి చెప్పాలంటే దీనికి 4 టైప్ సి పోర్ట్స్ థండర్ బోల్ట్, ఒక హెచ్‌డిఎంఐ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇది కాకుండా బ్లూటూత్, వై-ఫై రెండూ ఉన్నాయి. దీనిలో బ్యాక్‌లైట్ కీ బోర్డు, ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ 10 గంటల బ్యాకప్  ఉంటుందని క్లెయిమ్ చేయబడింది.

click me!