ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఫాస్ట్ ట్యాగ్ గ్రేట్ ఆఫర్.. ఆన్ లిమిటెడ్ ప్లాన్‌లతో క్యాష్‌బ్యాక్ కూడా..

By S Ashok KumarFirst Published Feb 15, 2021, 12:54 PM IST
Highlights

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  మాట్లాడుతూ  టోల్ చార్జిల కోసం  ఫాస్ట్ ట్యాగ్  ఏర్పాటుపై ఆఖరి గడువు  ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుండి  ఫాస్ట్ ట్యాగ్  తప్పనిసరి చేసింది. 

గత కొంతకాలంగా వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం సూచనలు జారీ చేసింది. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  మాట్లాడుతూ  టోల్ చార్జిల కోసం  ఫాస్ట్ ట్యాగ్  ఏర్పాటుపై ఆఖరి గడువు  ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుండి  ఫాస్ట్ ట్యాగ్  తప్పనిసరి చేసింది.

ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు పెనాల్టీగా రెట్టింపు జరిమానా వసూలు చేయనుంది. అయితే ఫాస్ట్‌ట్యాగ్‌ కొనుగులుపై డిస్కౌంట్ ఎలా పొందాలో తెలుసుకోండి..

ఎయిర్‌టెల్ కస్టమర్లకు  క్యాష్‌బ్యాక్ ఆఫర్ 
మీకు కారు ఉంటే అలాగే ఎయిర్‌టెల్ సిమ్ ఉంటే ఈ వార్త మీకోసమే. ఫాస్ట్‌టాగ్ కొనుగోలుపై ఎయిర్‌టెల్ వినియోగదారులకు 100 రూపాయల క్యాష్‌బ్యాక్ ఇస్తోంది, అయితే ఈ ఎయిర్‌టెల్ ఆఫర్ గురించి చాలా మందికి తెలియదు.

ఎయిర్‌టెల్ ప్లాన్‌లతో ఫాస్ట్‌టాగ్ కొనుగోలుపై రూ .100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది అలాగే ఫాస్ట్‌టాగ్ డెలివరీ కూడా ఇంటి వద్దకే అందిస్తుంది. రూ. 598, రూ .399, రూ .249, రూ .698, రూ .449 వంటి ఆన్ లిమిటెడ్ ప్లాన్‌లతో రూ .100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

also read మూడు సెల్ఫీ కెమెరాలతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. ఇంటర్నెట్ లో డిజైన్. ఫీచర్స్ లీక్.. ...

ఫాస్ట్‌ట్యాగ్‌పై క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలి ?

ఈ ఎయిర్‌టెల్  ఆఫర్ ఎయిర్‌టెల్  థాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చు. మీ ఫోన్‌లో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసిన తరువాత, మీ ఎయిర్‌టెల్ మొబైల్ నంబర్‌తో యాప్ లోకి లాగిన్ అవ్వలీ.  యాప్ హోమ్ పేజీలో కనిపించే డిస్కవర్ ఎయిర్‌టెల్ థాంక్స్ బ్యానర్‌పై క్లిక్ చేయండి.

దీని తరువాత, మీ ముందు ఒక పేజీ తెరుచుకుంటుంది, ఇక్కడ ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ .100 క్యాష్‌బ్యాక్ పొందువచ్చు, అయితే దాని క్రింద క్లెయిమ్ నౌ ఆప్షన్ ఉంటుంది.

దానిపై క్లిక్ చేయడం ద్వారా, మీరు ఫాస్ట్‌ట్యాగ్‌ను కొనుగోలు చేయవచ్చు, దానితో మీకు 100 రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ మీ ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు లేదా వాలెట్‌లో వస్తుంది.

 

click me!