'ట్విట్టర్'కి పోటీగా ఇండియన్ యాప్ వచ్చేసింది.. వాడటం ఎంతవరకు సురక్షితమో తెలుసుకోండి..

By S Ashok KumarFirst Published Feb 15, 2021, 6:52 PM IST
Highlights

దేశీ ట్విట్టర్ కూ యాప్ గత కొద్ది రోజులుగా బాగా ప్రాచుర్యం పొందింది. కూ యాప్‌లో దాదాపు అన్ని ప్రభుత్వ ఖాతాలు సృష్టించబడ్డాయి. ఇది కాకుండా ప్రభుత్వం కూడా ఈ యాప్‌ను ప్రోత్సహిస్తోంది. 

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కి పోటీగా ప్రారంభించిన మేడ్ ఇన్ ఇండియా దేశీ ట్విట్టర్ కూ యాప్ గత కొద్ది రోజులుగా బాగా ప్రాచుర్యం పొందింది. కూ యాప్‌లో దాదాపు అన్ని ప్రభుత్వ ఖాతాలు సృష్టించబడ్డాయి.

ఇది కాకుండా ప్రభుత్వం కూడా ఈ యాప్‌ను ప్రోత్సహిస్తోంది. కూ యాప్ ఇండియా యాప్ ఛాలెంజ్‌లో కూడా దాని శక్తిని చూపించింది. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం కూ యాప్‌ను అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు  సమాచారం.

ట్విట్టర్‌కు భారతీయ ప్రత్యామ్నాయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలో కూ యాప్‌ను అధికారికంగా ప్రకటించవచ్చని ఒక నివేదిక పేర్కొంది. కూ యాప్‌ను ప్రభుత్వం మొదటి ప్రభుత్వ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌గా కూడా ప్రకటించవచ్చని తెలిపింది.

ఈ సమాచారాన్ని మొదట ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కు యాప్‌లో షేర్ చేస్తుందని, ఆపై కు లింక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఈ యాప్‌లో ఖాతాలు ఉన్నవారు సురక్షితంగా లేరని ఇటీవల ఫ్రెంచ్ భద్రతా నిపుణుడు 'కు యాప్' వినియోగదారులను హెచ్చరించడం గమనార్హం.  

భద్రతా నిపుణుడు మాట్లాడుతూ కు యాప్‌లో 30 నిమిషాలు గడిపానని, భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వినియోగదారుల సున్నితమైన సమాచారం  ఇమెయిల్ అడ్రస్, పేరు, పుట్టినరోజుతో పాటు ఇతర సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు కనుగొన్నాట్లు తెలిపారు. కు యాప్ గురించి తన పరిశోధనలను వివరించడానికి అతను అనేక ట్వీట్లు చేశాడు.
 

కూ యాప్ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ రాధాకృష్ణ మాట్లాడుతూ డేటా లీక్ వివాదం అనవసరంగా చేస్తున్నారని అన్నారు. ఒక వినియోగదారుడు తన ప్రొఫైల్‌ను కూలో సృష్టించినప్పుడు ఇ-మెయిల్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, లింగం, విద్య వంటి సమాచారం అతని నుండి తీసుకోబడుతుంది అని అన్నారు.

కూ యాప్ అంటే ఏమిటి? 
మీలో చాలా మందికి కూ అనువర్తనం గురించి తెలిసి ఉండవచ్చు, కానీ చాలా మందికి ప్రస్తుతం దాని గురించి పూర్తిగా తెలియదు. కూ అనేది ట్విట్టర్ కి పోటీగా ప్రవేశపెట్టిన మైక్రోబ్లాగింగ్ సైట్.  కూ యాప్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా ట్విట్టర్.

ఇది హిందీ, ఇంగ్లీష్ సహా ఎనిమిది భారతీయ భాషలలో లభిస్తుంది. కూ యాప్ ఇంకా వెబ్‌సైట్ ద్వారా ఉపయోగించవచ్చు. దీని ఇంటర్ఫేస్ ట్విట్టర్ లాగానే ఉంటుంది. దీనిలో 350 పదాల పరిమితి ఉంది.

click me!