ఈ మొబైల్ యాప్స్ ఆండ్రాయిడ్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.. అవేంటో ఒకసారి లుక్కెయండి..

By asianet news telugu  |  First Published Jan 6, 2023, 8:08 PM IST

ఇలాంటి చాలా ఉపయోగకరమైన యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నాయి, ఇవి మీ డైలీ వర్క్స్ ఇంకా లైఫ్ స్టయిల్ సులభతరం చేస్తాయి. ఈ యాప్‌తో మీరు మీ ఫోన్ మెమరీ స్టోరేజీని కూడా బాగా మేనేజ్ చేసుకోవచ్చు. 


నేటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి పనికి అవసరంగా మారింది. ఆన్‌లైన్‌లో చేయగలిగే దాదాపు ప్రతిదీ స్మార్ట్‌ఫోన్ నుండి చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్ యాక్సెస్ మరింత సులభతరం అయ్యింది. ఇలాంటి చాలా ఉపయోగకరమైన యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నాయి, ఇవి మీ డైలీ వర్క్స్ ఇంకా లైఫ్ స్టయిల్ సులభతరం చేస్తాయి. మీ ఫోన్లో వర్క్స్ ఇంకా స్టోరేజ్ మేనేజ్‌మెంట్ కోసం చాలా ఉపయోగకరంగా ఉండే  అండ్రాయిడ్ యాప్‌ల గురించి తెలుసుకోండి...

గూగుల్ ఫైల్స్
గూగుల్ నుండి వస్తున్న గూగుల్ ఫైల్స్ మనకు అత్యంత ఉపయోగకరమైన యాప్‌గా కనిపిస్తోంది. ఈ యాప్ సాయంతో ఫైల్ ట్రాన్స్ ఫర్, ఫైల్ బ్రౌజ్ తో పాటు స్టోరేజీ మేనేజ్ మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇది మీ ఆండ్రాయిడ్ డివైజ్ స్టోరేజ్ కోసం ఆల్ ఇన్ వన్ యాప్‌గా పనిచేస్తుంది. దీనితో అతిపెద్ద ఫైల్‌ను ఇతర ఆండ్రాయిడ్ డివైజెస్లకు సులభంగా ఇంకా అతి తక్కువ సమయంలో షేర్ చేయవచ్చు. ఈ యాప్‌తో మీరు మీ ఫోన్ మెమరీ స్టోరేజీని కూడా బాగా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సహాయంతో పాత ఇంకా అనవసరమైన ఫైల్స్, ఫోన్ నుండి జంక్ క్లియర్ చేయడం అలాగే డూప్లికేట్ ఫైల్‌లను డిలెట్ చేయడం చాలా సులభం. 

Latest Videos

undefined

ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ 
ఈ యాప్ సహాయంతో ఫోన్ ప్రస్తుత డేటా స్పీడ్‌ను చూడవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ లైట్ యాప్ చాలా తక్కువ స్టోరేజీలో పనిచేస్తుంది. ఈ యాప్ సైజ్ 2-3ఎం‌బి, ఇంటర్నెట్ స్పీడ్ నుండి మీ ఫోన్ డేటా యుసెజ్ వరకు ప్రతిదీ రికార్డ్ చేస్తుంది. ఈ యాప్ సహాయంతో మీరు డేటా బ్యాలెన్స్‌ను మళ్లీ మళ్లీ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా డేటా అయిపోతుందనే భయం లేదు. ఈ యాప్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు తక్కువ డేటాతో రీఛార్జ్ ప్లాన్ తీసుకున్నప్పటికీ, మెరుగైన డేటా మ్యానేజ్మెంట్ లో ఈ యాప్ మీకు సహాయపడుతుంది. దీనితో పాటు, మీరు ఒక క్లిక్‌తో మీ మిగిలిన డేటా బ్యాలెన్స్ గురించి సమాచారాన్ని కూడా పొందవచ్చు. 

నోట్స్ 
కీప్ నోట్స్ అనేది గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న చాలా ఉపయోగకరమైన యాప్. ఈ యాప్ డిజిటల్ డైరీలా పనిచేస్తుంది, ఇందులో మీరు ముఖ్యమైన ఇంకా అవసరమైన్ విషయాలను నోట్ చేసుకోవచ్చు. కీప్ నోట్స్‌లో చెక్ లిస్ట్ ఆప్షన్ కూడా ఉంది, దీనిలో మీరు గృహోపకరణాల నుండి అవసరమైన వస్తువుల లిస్ట్ కూడా నోట్ చేయవచ్చు. అంటే, ఏదైనా రాయడం ఇంకా గుర్తుంచుకోవడం సులభంగా చేయవచ్చు. దీనితో పాటు, ఎన్నో కలర్ ఆప్షన్స్ కూడా ఇందులో  ఉన్నాయి, ఇది మరింత సరదాగా ఉంటుంది. మీరు Keep Notesలో కూడా  ఏదైనా డ్రా చేయవచ్చు. యాప్‌లో టెక్స్ట్‌తో ఫోటోలను సేవ్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

హమ్మర్ సెక్యూరిటి యాప్ 
ఈ యాప్ ఒక సెక్యూరిటీ యాప్, దీని సహాయంతో  దొంగిలించబడిన ఫోన్ ట్రాక్ చేయవచ్చు. ఈ యాప్‌ను Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇంకా దీన్ని సెటప్ చేయడం చాలా సులభం. యాప్‌కి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. డమ్మీ స్విచ్ ఆఫ్, ఫేక్ ఫ్లైట్ మోడ్ వంటి ఎన్నో సెక్యూరిటీ ఫీచర్లు యాప్‌లో ఉన్నాయి. అంటే, మీ ఫోన్ దొంగిలించబడి దొంగ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి లేదా ఫ్లైట్ మోడ్‌లో ప్రయత్నించినట్లయితే అప్పుడు ఫోన్ డమ్మీ స్విచ్ ఆఫ్ చేయబడుతుంది ఇంకా దొంగ ఫోటోను కూడా క్యాప్చర్ చేస్తుంది. ఈ యాప్ దొంగ ఆడియో అండ్ లొకేషన్‌ను కూడా రికార్డ్ చేస్తుంది. మీరు ఇచ్చిన ఎమర్జెన్సీ నంబర్ సహాయంతో ఫోన్‌ను కూడా ట్రాక్ చేయగలుగుతారు.

click me!