ట్రూకాలర్ యాప్... బ్యాంక్ ఖాతాలో డబ్బుకి ముప్పు...?

By telugu teamFirst Published Jul 30, 2019, 4:32 PM IST
Highlights

మనం ఊహించని మరో ముప్పును ఈ ట్రూకాలర్ తెచ్చిపెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ యాప్ లో వచ్చిన అప్ డేట్ తో మన బ్యాంక్ అకౌంట్లకు మప్పు ఏర్పడింది. ఈ యాప్ కొత్త వెర్షన్ కు అప్ డేట్ అయిన యూజర్ల బ్యాంక్ యూపీఐ ఖాతాలు ట్రూకాలర్ పే ఫీచర్ లో ఆటోమేటిక్ గా  యాడ్ అవుతున్నాయి.

ట్రూకాలర్ యాప్ తో మనకు ముప్పు దాగి ఉందా? అవుననే సమాధానం ఎక్కువగా వినపడుతుంది. అపరిచిత వ్యక్తులతో పాటు పలు కంపెనీల నుంచి వచ్చే కాల్స్, అడ్వర్టయిజింగ్ మెసేజ్ ల బారి నుంచి తప్పించుకునేందుకు ట్రూ కాలర్ యాప్ ని అందరూ వినియోగిస్తున్నారు. ఈ  యాప్ సహాయంతో సదరు కాల్స్ చేసే, ఎస్ఎంఎస్ లను పంపే ఫోన్ నెంబర్లు యూజర్లను బ్లాక్ చేసుకునే అవకాశం ఉంది. 

అయితే... ట్రూకాలర్ యాప్ వల్ల మనకు అంతా లాభమే కనిపించింది. అయితే.. మనం ఊహించని మరో ముప్పును ఈ ట్రూకాలర్ తెచ్చిపెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ యాప్ లో వచ్చిన అప్ డేట్ తో మన బ్యాంక్ అకౌంట్లకు మప్పు ఏర్పడింది. ఈ యాప్ కొత్త వెర్షన్ కు అప్ డేట్ అయిన యూజర్ల బ్యాంక్ యూపీఐ ఖాతాలు ట్రూకాలర్ పే ఫీచర్ లో ఆటోమేటిక్ గా  యాడ్ అవుతున్నాయి.

యూజర్లు యాప్ లో  యూపీఐ ఐడీని యాడ్ చేసుకోవడం కోసం ఎలాంటి రిక్వెస్ట్ పంపించకపోయినప్పటికీ ఆటోమేటిక్ గా ఈ ఐడీలు ట్రూ కాలర్ యాప్ లో యాడ్ అవుతున్నాయి. అలాగే యూపీఐ ఐడీలు యాడ్ చేసినట్లు కన్ ఫాం కూడా అవుతున్నాయి. దీనిపై ట్రూకాలర్ యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ట్రూకాలర్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేయాలంటూ కొందరు ట్వీట్లు చేయడం గమనార్హం. యూపీఐ ఐడీలు ఇలా తెలియడం వల్ల బ్యాంకు ఖాతాల్లోని తమ నగదు పోయే ప్రమాదం ఉందని యూజర్లు భయపడుతున్నారు. మరి దీనిపై ట్రూకాలర్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

click me!