12న రిలయన్స్ ఏజీఎం.. అదే రోజు జియో గిగా ఫైబర్ సర్వీస్ షురూ?!

By rajesh yFirst Published Jul 30, 2019, 11:41 AM IST
Highlights

వచ్చేనెల 12వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అదే రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం జరుగనున్నది. సంచలనాలకు మారుపేరైన రిలయన్స్.. మూడేళ్ల క్రితం ప్రారంభించిన జియో.. టెలికం రంగాన్నే షేక్ చేస్తోంది. తాజాగా బ్రాడ్ బాండ్ సేవల్లోకి అంటే జియో గిగా ఫైబర్ సర్వీసులు 12వ తేదీన ప్రారంభించనున్నదని సమాచారం. దీంతోపాటు రిలయన్స్ జియో టీవీ సిరీస్ కూడా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. రిలయన్స్ జియో గిగా ఫైబర్ సర్వీసులను ఆగస్టు 12న మరో ప్రారంభించనున్నది. వచ్చేనెల 12వ తేదీన జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ సేవలను ప్రారంభించనున్నట్టు సమాచారం. 

ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్‌టీటీహెచ్) టెక్నాలజీపై పనిచేయనున్న రిలయన్స్ జియో గిగాఫైబర్ ద్వారా అతి తక్కువ ధరకే ఖాతాదారులకు 3 రకాల సేవలు అందనున్నాయి. అందులో మొదటిది బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు కాగా, రెండోది ల్యాండ్‌లైన్, మూడోది టీవీ కనెక్షన్.
 
కొన్ని నెలలుగా గిగాఫైబర్ సేవలను పరీక్షిస్తున్న జియో ఇప్పుడు దీనిని అధికారికంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేవలం రూ. 600లకే మూడు రకాల సేవలు జియో గిగా‌ఫైబర్ ద్వారా లభించనున్నాయి. ఇందులో  ఒక జీబీ ర్యామ్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు, 600 టీవీ చానళ్లు, ల్యాండ్‌లైన్ కనెక్షన్ లభిస్తాయి. ఇందులో ప్రీ పెయిడ్, పోస్టు పెయిడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి. 

ఓఎన్టీ డివైజ్ (గిగాహబ్ హోం గేట్‌వే) కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.4500 చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి ఈ సేవలు వద్దనుకుంటే డిపాజిట్ చేసిన రూ.4500లను వెనక్కి ఇచ్చేస్తారు. ఓఎన్టీ డివైజ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు రౌటర్‌లా పనిచేస్తుంది.

కేవలం మూడేళ్ల కాలంలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించిన రిలయన్స్ జియో మాదిరిగానే ఇప్పుడు జియో గిగాఫైబర్ కూడా మార్కెట్‌లో సంచలనం స్రుష్టించొచ్చనే అంచనాలు ఉన్నాయి. 

ఇంతకుముందు రిలయన్స్ జియో అమలు చేసిన చౌక ధరల ప్లాన్ ఇందుకు కారణం. ఇప్పటి వరకు ఎంపిక చేసిన వినియోగదారులకు ప్రీ వ్యూ ఆఫర్లు అందిస్తోంది రిలయన్స్ జియో. ఇదిలా ఉంటే జియో గిగా ఫైబర్ దేశంలోని 1100 నగరాల్లో తొలుత సేవలందిస్తుంది. తర్వాత 1600 నగరాలకు, పట్టణాలకు విస్తరిస్తుంది. 

ఇకపోతే రిలయన్స్ జియో తన మైజియో యాప్ ద్వారా కస్టమర్లను బ్రాడ్‌బాండ్ సర్వీస్‌కు ఏ పేరు పెట్టాలో చెప్పాలంటూ కస్టమర్లను కోరుతోంది. యూజర్లకు జియో ఫైబర్, జియో హోమ్, జియో గిగాఫైబర్ అనే మూడు ఆప్షన్లు ఇచ్చింది. 

click me!