గుడ్ న్యూస్...ఇక ఎప్పుడైనా..మని ట్రాన్సక్షన్స్ చేయొచ్చు!!

By Sandra Ashok KumarFirst Published Dec 17, 2019, 2:24 PM IST
Highlights

ఇక నుంచి నెఫ్ట్‌ ద్వారా ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరో బ్యాంక్‌ ఖాతాకు నగదు బదిలీని రోజులో ఎప్పుడైనా చేసుకునే వసతిని కల్పిస్తుంది. బ్యాంక్‌ సెలవు రోజుల్లోనూ నెఫ్ట్‌ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. 

న్యూఢిల్లీ: డిజిటల్‌ లావాదేవీల ప్రోత్సాహానికి నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలక్ట్రానిక్ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌) ద్వారా నగదు బదిలీలు 24 గంటలు కొనసాగించేందుకు ఆర్బీఐ (రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా) నిర్ణయం తీసుకొంది.

also read మొబైల్ నెంబర్ పోర్టబిలిటీపై ట్రాయ్ కొత్త రూల్స్...

ఇక నుంచి నెఫ్ట్‌ ద్వారా ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరో బ్యాంక్‌ ఖాతాకు నగదు బదిలీని రోజులో ఎప్పుడైనా చేసుకునే వసతిని కల్పిస్తుంది. బ్యాంక్‌ సెలవు రోజుల్లోనూ నెఫ్ట్‌ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. గతంలో నెఫ్ట్ ద్వారా లావాదేవీలు కేవలం ఉదయం 8 నుంచి సాయంత్రం 6:30 గంటల మధ్య మాత్రమే చేనేందుకు అవకాశం ఉండేది.

తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది. ఏడాది మొత్తంలో రోజు, వారం, సెలవులతో సంబంధం లేకుండా 24/7 నెఫ్ట్‌ లావాదేవీలు జరపవచ్చని తెలిపింది. ఈ సేవలను ఖాతాదారులకు అందించినందుకు ప్రధాన బ్యాంకులేవి వారి నుంచి ఎటువంటి అధిక రుసుము వసూలు చేయవని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

also read జియో కొత్త ప్రాడక్ట్ ...ఆ కస్టమర్లకు మాత్రమే...

దీనికనుగుణంగా నెఫ్ట్‌ ద్వారా జరిగే నగదు బదిలీలకు ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని ఆర్బీఐ ఈ ఏడాది జులైలో బ్యాంకులకు సూచించింది.  దీని ద్వారా  బ్యాంకులు మెరుగైన నిధుల నిర్వహణకు తోడ్పడుతుందని ఆర్‌బీఐ పేర్కొంది.

click me!