మొబైల్ నెంబర్ పోర్టబిలిటీపై ట్రాయ్ కొత్త రూల్స్...

By Sandra Ashok Kumar  |  First Published Dec 16, 2019, 5:50 PM IST

ఈ రోజు నుండి కొత్త ఎం‌ఎన్‌పి నియమాల ద్వారా వినియోగదారులలు కేవలం రెండు రోజుల్లో కొత్త టెలికాం ఆపరేటర్‌కు పోర్ట్ అవ్వోచు. టెలికాం ఆపరేటర్లు ప్రతిసారి కొత్త ప్లాన్లను ప్రారంభిస్తున్నందున, వేగంగా ఎం‌ఎన్‌పి ప్రక్రియ జరిగేలా మార్పులు చేశారు. 


టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చివరకు కొత్త  మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పి) నిబంధనలను అమలు చేసింది. ఈ రోజు నుండి కొత్త ఎం‌ఎన్‌పి నియమాల ద్వారా వినియోగదారులలు కేవలం రెండు రోజుల్లో కొత్త టెలికాం ఆపరేటర్‌కు పోర్ట్ అవ్వోచు.

టెలికాం ఆపరేటర్లు ప్రతిసారి కొత్త ప్లాన్లను ప్రారంభిస్తున్నందున, వేగంగా ఎం‌ఎన్‌పి ప్రక్రియ జరిగేలా మార్పులు చేశారు. కొత్త ప్రక్రియను గత ఏడాది డిసెంబర్‌లో ప్రకటించారు తరువాత దీనిని అమలు చేయడానికి అనేక సమస్యలు కారణమైంది.

Latest Videos

also read షియోమీ, వన్‌ప్లస్ లాగే ‘స్మార్ట్ టీవీల్లోకి’ ఇన్ఫినిక్స్

ఇక నుంచి మొబైల్ నెంబర్ పోర్టింగ్  96 గంటల నుండి 48 గంటలకు తగ్గించారు. కొత్త ఎం‌ఎన్‌పి నియమాలలో ఎం‌ఎన్‌పి కోసం  ప్రత్యేకమైన పోర్టింగ్ కోడ్ (యుపిసి) జనరేట్ చేస్తారు. ఏదైనా కొత్త నెట్వర్క్ లోకి వినియోగదారుడు పోర్ట్ అవ్వాలంటే ముందుగా ప్రస్తుత ఆపరేటర్ నెట్‌వర్క్‌లో కనీసం 90 రోజులు ఉండాలి. 

వినియోగదారుడు పోర్ట్ అవ్వాలనుకుంటే 5 నిమిషాల్లో యూపీసీ కోడ్ వినియోగదారుడికి ఇవ్వలి. మీ ప్రత్యేకమైన పోర్టింగ్ కోడ్ లేదా యుపిసిని రూపొందించడానికి, SMS PORT (space) 99XXXXXXXX టైప్ చేసి 1900 కు సెండ్ చెయ్యాలి. మీరు UPC కోడ్‌తో SMS ద్వారా కోడ్‌ వస్తుంది.

also read తొలి ఏడాదే ఇండియన్ బెస్ట్ బ్రాండ్ ‘రియల్ మీ’

జమ్మూ కాశ్మీర్, అస్సాం ఇంకా నార్త్ ఈస్ట్ లకు చెందిన ఎల్ఎస్ఏలు మినహా అన్ని లైసెన్స్ పొందిన సర్విస్ ప్రాంతాలకు (ఎల్ఎస్ఏ) యుపిసికి చెల్లుబాటు 15 రోజుల నుండి 4 రోజులకు తగ్గించారు. ఎం‌ఎన్‌పి కోసం వినియోగదారులు వారి చిరునామా, గుర్తింపు కార్డ్ ఇవ్వల్సి ఉంటుంది.

ఒకే సర్కిల్‌లోని ఇతర ఆపరేటర్‌లకు పోర్టింగ్ మూడు రోజుల్లో అవుతుంది. పోర్టింగ్ మరొక సర్కిల్‌కు ఉంటే దానికి ఐదు రోజుల టైమ్ పడుతుందని ట్రాయ్ పేర్కొంది. కార్పొరేట్ మొబైల్ కనెక్షన్ల కోసం పోర్టింగ్ లో ఎలాంటి మార్పు లేదు. అలాగే, జాతీయ ఎంఎన్‌పికి పోర్టింగ్ టైమ్‌లైన్‌లో ఎటువంటి మార్పు లేదు.ఎంఎన్‌పి ప్రక్రియను సులభతరం చేయడం వినియోగదారులతో పాటు టెలికాం ఆపరేటర్లకు చాలా ప్రయోజకంగా ఉంటుంది. 
 

click me!